విషాదం…ఆస్పత్రి పైనుంచి దూకిన కరోనా బాధిత జర్నలిస్ట్..

|

Jul 06, 2020 | 7:45 PM

కరోనాకు చికిత్స తీసుకుంటున్న ఓ వ్యక్తి ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తు తీవ్రగాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు.

విషాదం...ఆస్పత్రి పైనుంచి దూకిన కరోనా బాధిత జర్నలిస్ట్..
Follow us on

కరోనాకు చికిత్స తీసుకుంటున్న ఓ వ్యక్తి ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తు తీవ్రగాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఢిల్లీలోని ఓ ప్రముఖ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తుండటం, మనస్తాపంతోనే ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియటంతో తీవ్ర కలకలం రేపింది.

కరోనా బారిన పడ్డ ఓ జర్నలిస్ట్ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతున్నాడు. వైరస్ సోకినప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న 34 ఏళ్ల ఆ జర్నలిస్టు సోమవారం ఆసుపత్రి నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అయితే, సదరు జర్నలిస్ట్ కు కరోనా సోకిందనే విషయం తెలియగానే.. యాజమాన్యం అతడిని విధుల్లో నుంచి తప్పించారని బాధితుడి బంధువులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.