World Wide Corona Update: ప్రపంచ దేశాల్లో కొనసాగుతున్న కరోనా మృత్యుఘోష… 19 లక్షలు దాటిన మరణాలు

|

Jan 09, 2021 | 11:45 AM

ఓ వైపు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కల్లోలానికి గురిచేస్తుంటే.. మరోవైపు స్ట్రెయిన్ మరింత గుబులు పుట్టిస్తోంది. ఏడాది నుంచి దేశవిదేశాల్లో కోవిడ్ కరాళ నృత్యాన్ని..

World Wide Corona Update: ప్రపంచ దేశాల్లో కొనసాగుతున్న కరోనా మృత్యుఘోష... 19 లక్షలు దాటిన మరణాలు
Follow us on

World Wide Corona Update: ఓ వైపు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కల్లోలానికి గురిచేస్తుంటే.. మరోవైపు స్ట్రెయిన్ మరింత గుబులు పుట్టిస్తోంది. ఏడాది నుంచి దేశవిదేశాల్లో కోవిడ్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు తొమ్మిది కోట్లకు చేరువలో ఉంది. గత 24 గంటల్లో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8 93,31,477లకు చేరుకుంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 19,20,790 మంది మరణించారు. ఈ కరోనా నుంచి 6,39,94,149 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండడంతో.. బ్రిటన్, జర్మనీ సహా పలు దేశాలు లాక్ డౌన్ ను పొడిగించాయి. జపాన్ రాజధాని టోక్యోలో అత్యవసర పరిస్థితిని విధించారు.

మరో వైపు అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయంతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో దాదాపు మూడు లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా మూడువేల మంది మృత్యువాత పడ్డారు. అగ్రరాజ్యంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 21.8 మిళియన్లకు చేరుకోగా.. మొత్తం 3. 68 లక్షల మంది మరణించారని… 1. 31 లక్షల మంది బాధితులు చికిత్స పొందుతున్నారని జాన్స్ హాప్ కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.

Als0 Read: ఇప్పటికే బర్డ్ ఫ్లూ 6 రాష్ట్రాలకు వ్యాప్తి.. దేశ రాజధానిలో మరణించిన పక్షులు .. కేంద్రం అలర్ట్