Bird flu Confirmed 6 States: ఇప్పటికే బర్డ్ ఫ్లూ 6 రాష్ట్రాలకు వ్యాప్తి.. దేశ రాజధానిలో మరణించిన పక్షులు .. కేంద్రం అలర్ట్

ఏడాది గడుస్తున్నా దేశంలో ఇప్పటికీ అదుపులోకి రాని కరోనా వైరస్ తోనే ప్రభుత్వాలు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు బర్డ్ ఫ్లూ భయభ్రాంతులకు గురిచేస్తుంది. రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చిన..

Bird flu Confirmed 6 States: ఇప్పటికే బర్డ్ ఫ్లూ 6 రాష్ట్రాలకు వ్యాప్తి.. దేశ రాజధానిలో మరణించిన పక్షులు .. కేంద్రం అలర్ట్
Follow us

|

Updated on: Jan 09, 2021 | 7:00 AM

Bird flu Confirmed 6 States: ఏడాది గడుస్తున్నా దేశంలో ఇప్పటికీ అదుపులోకి రాని కరోనా వైరస్ తోనే ప్రభుత్వాలు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు బర్డ్ ఫ్లూ భయభ్రాంతులకు గురిచేస్తుంది. రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ మెల్లగా ఇతరరాష్ట్రాలకు విస్తరిస్తోంది. పెద్ద సంఖ్యలో కాకులు మృతి చెందుతుండడంతో బర్డ్ ఫ్లూ పై కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటి వరకూ ఆరు రాష్ట్రాల్లో ఏవియన్ ఫ్లూ వ్యాప్తి ఉందని తెలిపింది. కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా గుజరాత్ రాష్ట్రాల్లో బర్ద్ ఫ్లూ ఉందని ప్రకటించింది.

ఈనేపధ్యంలో కేరళ ప్రభుత్వం బర్డ్ ఫ్లూ పై ఎమర్జెన్సీని ప్రకటించింది. మరోవైపు తాజా పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు కేరళ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాయి. కేరళలోని రెండు జిల్లాల్లో కల్లింగ్ కార్యకలాపాలు పూర్తయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరో వైపు హర్యానాలో కొన్ని కోళ్ల ఫారాల నుంచి సేకరించిన నమూనాలు బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని రావడంతో 1.60 లక్షల కోళ్లను వధించనున్నారు. బర్డ్ ఫ్లూపై కోళ్ల ఫారాల యాజమాన్యాలకు అవగాహన కల్పించేందుకు హర్యానా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

మరోవైపు దేశరాజధాని ఢిల్లీ లోనూ పలు పక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించాయని కేంద్రం వెల్లడించింది. పరీక్షల నిమిత్తం వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపించమని తెలిపింది. అయితే బర్ద్ ఫ్ల్యూ దేశం మొత్తమ్మీద చాలా రాష్ట్రాల్లో లేకపోయినా  తాజా పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచాలని కేంద్రం కోరింది. ఎక్కడైనా పక్షుల అనుమానాస్పద మరణాలను గుర్తిస్తే, వెంటనే తెలియజేయాలని సూచించింది. తద్వారా సాధ్యమైనంత తక్కువ సమయంలో వ్యాధి కట్టడి చేయవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.

Also Read: దేశ వ్యాప్తంగా 5 వేల కేంద్రాల్లో కోవిడ్ టీకా పంపిణీ.. ఏపీలో 332 సెంటర్స్ ఏర్పాటు

రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!