లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. లిక్కర్ దొరకలేదని సూసైడ్ చేసుకున్నాడట..!

| Edited By: Pardhasaradhi Peri

Mar 27, 2020 | 9:44 PM

కరోనాను అరికట్టేందుకు.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు దొరకడం కష్టమైంది. అయితే అప్పటికీ ప్రభుత్వం కిరాణా దుకాణాలు, ఫుడ్‌కు సంబంధించిన షాపింగ్ మాల్స్‌ను తెరిచేందుకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా దాదాపు మద్యం దుకాణాలన్నీ మూతపడ్డాయి. దీంతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఇక మద్యానికి బానిసైన కేరళకు చెందిన ఓ 38 ఏళ్ల వ్యక్తి మద్యం దొరక్కపోవడంతో.. […]

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. లిక్కర్ దొరకలేదని సూసైడ్ చేసుకున్నాడట..!
Follow us on

కరోనాను అరికట్టేందుకు.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు దొరకడం కష్టమైంది. అయితే అప్పటికీ ప్రభుత్వం కిరాణా దుకాణాలు, ఫుడ్‌కు సంబంధించిన షాపింగ్ మాల్స్‌ను తెరిచేందుకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా దాదాపు మద్యం దుకాణాలన్నీ మూతపడ్డాయి. దీంతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.

ఇక మద్యానికి బానిసైన కేరళకు చెందిన ఓ 38 ఏళ్ల వ్యక్తి మద్యం దొరక్కపోవడంతో.. తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని ఈ  అఘాయిత్యానకి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని తువ్వనూర్‌‌లో శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అయితే ఇదిలా ఉంటే.. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి.. ఇతర కారణాలతో ఇబ్బందులు పడుతున్నట్లు తన బంధువు ఒకరు తెలిపారు. మృతుడి తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితయ్యారని, ఇక అతని తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతుందని.. ఈ క్రమంలోఉద్యోగం కోసం ప్రయత్నిస్తే.. ఎక్కడ కూడా ఉద్యోగం రాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నాడు.