కరోనా వారియర్స్‌కు పేటీఎం చేయూత.. 60 హోటళ్లలలో బస..

|

Apr 03, 2020 | 2:36 PM

COVID 19 Heroes: కరోనా వైరస్ బాధితులకు రాత్రింబవళ్ళు చికిత్స అందిస్తున్న వైద్యులకు సాయం చేయడం కోసం ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎం ముందుకు వచ్చింది. దాదాపు 300 హోటళ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుని.. తమ యాప్‌లో తాత్కాలికంగా హోటెల్ లిస్టింగ్స్ పేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు వైద్యులు ఎంతగానో శ్రమిస్తున్నారని.. వాళ్లకు మద్దతు పలకడానికి సుమారు 60కి పైగా నగరాల్లో అనేక హోటళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు పేటీఎం స్పష్టం చేసింది. […]

కరోనా వారియర్స్‌కు పేటీఎం చేయూత.. 60 హోటళ్లలలో బస..
Follow us on

COVID 19 Heroes: కరోనా వైరస్ బాధితులకు రాత్రింబవళ్ళు చికిత్స అందిస్తున్న వైద్యులకు సాయం చేయడం కోసం ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎం ముందుకు వచ్చింది. దాదాపు 300 హోటళ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుని.. తమ యాప్‌లో తాత్కాలికంగా హోటెల్ లిస్టింగ్స్ పేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు వైద్యులు ఎంతగానో శ్రమిస్తున్నారని.. వాళ్లకు మద్దతు పలకడానికి సుమారు 60కి పైగా నగరాల్లో అనేక హోటళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు పేటీఎం స్పష్టం చేసింది.

పేటీఎం యాప్‌లోని ‘వి సెల్యూట్ యూ ఆల్’ అనే ట్యాగ్ ద్వారా వైద్యులు తాము పనిచేస్తున్న క్లినిక్‌లు, ఆస్పత్రులకు దగ్గర్లోని హోటళ్లను సెర్చ్ చేసి రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓయో, ట్రీబో, జింజర్ హోటల్స్ తదితర యాప్‌లు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. మున్ముందు మరిన్ని హోటళ్లను కూడా ఈ కార్యక్రమంలో తీసుకొస్తామని సంస్థ పేర్కొంది. ఈ హోటళ్లలోని రూమ్‌లను మెడికల్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అభినవ్ కుమార్ వెల్లడించింది.

ఇది చదవండి: కరోనాను దాచిపెట్టిన చైనా.. బయటపడ్డ సంచలన రహస్యాలు..