అలర్ట్‌.. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగంపై ప్రభుత్వం న్యూ గైడ్‌లైన్స్..!

| Edited By:

Apr 25, 2020 | 7:54 PM

కరోనా ప్రభావంతో ప్రస్తుతం అనేక దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మన దేశంలో కూడా కరోనా కట్టడలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈ క్రమంలో వాతావరణంలో మార్పులతో కూడా ఈ వైరస్‌ను కాస్తైనా నియంత్రించవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలో.. ఆఫీసుల్లో, హాస్పటల్స్‌లో, ఇళ్లలో కరోనా వైరస్‌.. వ్యాప్తిని నిరోధించేందుకు ఎయిర్‌ కండిషనింగ్ (ఏసీ), వెంటిలేషన్‌ వాడకం‌పై కేంద్రం న్యూ గైడ్‌ లైన్స్‌ విడుదల చేసింది. ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్ […]

అలర్ట్‌.. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగంపై ప్రభుత్వం న్యూ గైడ్‌లైన్స్..!
Follow us on

కరోనా ప్రభావంతో ప్రస్తుతం అనేక దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మన దేశంలో కూడా కరోనా కట్టడలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈ క్రమంలో వాతావరణంలో మార్పులతో కూడా ఈ వైరస్‌ను కాస్తైనా నియంత్రించవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలో.. ఆఫీసుల్లో, హాస్పటల్స్‌లో, ఇళ్లలో కరోనా వైరస్‌.. వ్యాప్తిని నిరోధించేందుకు ఎయిర్‌ కండిషనింగ్ (ఏసీ), వెంటిలేషన్‌ వాడకం‌పై కేంద్రం న్యూ గైడ్‌ లైన్స్‌ విడుదల చేసింది. ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్ రిఫ్రిజిరేంటింగ్ అండ్ కండిషనర్ ఇంజినీర్స్ (ఐఎస్‌హెచ్ఆర్ఏఈ) సూచించిన గైడ్‌లైన్స్‌ ప్రకారం..

ఏసీల వాడకంపై సూచనలు..

* 24 నుంచి 30 డిగ్రీల టెంపరేచర్ ఉండేలా చూసుకోవాలి
* తేమ స్థాయి కూడా 40 నుంచి 70 పర్సంటేజ్ ఉండేలా చూసుకోవాలి
* ఇలా చేయడం ద్వారా రోగకారకాల సమస్యను దాదాపు తగ్గించుకోవచ్చు

కూలర్ల వినియోగ విషయంలో సూచనలు

* మంచి వెంటిలేషన్‌ ఉండేలా చూడాలి
* కూలర్లు బయటి గాలిని పీల్చుకునేలా ఏర్పాటు
* కూలర్‌ ట్యాంకులు ఎప్పటికప్పుడు క్రిమిసంహారాలతో శుభ్రం చేయాలి
* రెగ్యులర్‌గా ఫ్రెష్ వాటర్‌తో నింపాలి
* తేమగాలి బయటికి పోయేలా ఏర్పాటు చేయాలి
* బయటి గాలిని పీల్చుకోలేని పోర్టబుల్ కూలర్లను వాడకపోవడం బెటర్

ఫ్యాన్లు వినియోగంపై సూచనలు

* కిటీకీలు కొద్దిగా తెరిచి ఉంచుకోవాలి
* దగ్గర్లో మరో ఫ్యాన్‌ ఉంటే.. తగిన వెలుతురు కోసం దాన్ని కూడా ఆన్‌లో ఉంచడం బెటర్

కరోనా మహమ్మారిపై చైనాలోని చేపట్టిన కొవిడ్-19పై చైనాలోని పలు నగరాల్లో చేపట్టిన అధ్యయనాల్లో..అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ.. ఈ కరోనా వ్యాప్తిని గణనీయంగా తగ్గిస్తుందని గుర్తించారు.