కరోనాకు అంతా ఒక్కటే..కులం, మతం, రంగు లేదు..

| Edited By: Pardhasaradhi Peri

Apr 19, 2020 | 9:02 PM

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ దేశాలన్నింటిలో కలిపి దాదాపు 23లక్షలకు పైగా ఈ మహమ్మారి బారినపడ్డారు. మనదేశంలో కూడా క్రమక్రమంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఓ ట్వీట్‌ చేశారు. ఈ మహమ్మారి కరోనాకు విశ్వాసం, రంగు, కులం, మతంతో సంబంధం లేదని.. ప్రతి […]

కరోనాకు అంతా ఒక్కటే..కులం, మతం, రంగు లేదు..
Follow us on

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ దేశాలన్నింటిలో కలిపి దాదాపు 23లక్షలకు పైగా ఈ మహమ్మారి బారినపడ్డారు. మనదేశంలో కూడా క్రమక్రమంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఓ ట్వీట్‌ చేశారు. ఈ మహమ్మారి కరోనాకు విశ్వాసం, రంగు, కులం, మతంతో సంబంధం లేదని.. ప్రతి ఒక్కరిపై దీని ప్రభావం సేమ్ ఉంటుందని ట్వీట్‌ చేశారు.

‘‘ఈ మహమ్మారి వైరస్‌ కులం, మతం, రంగు, జాతి, భాష.. లాంటి దేనినీ పట్టించుకోదు. అందరిపైనా ఒకేలా ఎటాక్‌ చేస్తోంది. ఈ కరోనాను ఎదుర్కొనే విధానం మనల్ని విడగొట్టేలా ఉండకూడదు. యునిటీని, సుహృద్భావాన్ని పెంచేలా ఉండాలి. మనమంతా కలిసి ఈ కరోనాతో పోరాటం చేయాలి.’’అంటూ ప్రధాని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా.. గతంలో కూడా ఒక దేశంతో మరో దేశం యుద్ధానికి దిగిన సందర్భాలు ఉన్నాయని.. కానీ ఈ కరోనా మహమ్మారి చేయడంతో.. దేశాలన్నీ దీనిపై యుద్ధం చేస్తున్నాయన్నారు. ప్రపందచ దేశాలన్నింటకి ఇది ఓ పెద్ద సవాల్‌గా మారిందన్నారు.