
Telangana Corona Cases Decline: తెలంగాణలో కరోనా వైరస్ అదుపులోనే ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరక్టర్ జీ.శ్రీనివాసరావు తెలిపారు. లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయన్నారు. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 2,261 కోవిడ్ పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయన్నారు. కాగా, ఇవాళ 18 మంది మరణించారని డీహెచ్ వెల్లడించారు. కరోనా బారి నుంచి నిన్న 3,043 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆయన వెల్లడించారు.
ఇక, తెలంగానలో కరోనా పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిందని శ్రీనివాసరావు వెల్లడించారు. అయితే, సెకండ్ వేవ్‌లో పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెల్లోనూ కోవిడ్ కేసులు ఎక్కువగా వెలుగు చేశాయన్న ఆయన.. గ్రామాల్లోనూ పకడ్బంధీగా లాక్‌డౌన్ అమలు కావాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి కరోనా పరిస్థితులపై ఆరా తీసినట్టు ఆయన చెప్పారు. వచ్చే వారంలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గితే లాక్‌డౌన్ ఎత్తివేసే అవకాశముందని డీహెచ్ వెల్లడించారు.
Telangana Coronavirus Cases Today Updates