Telangana Coronavirus: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గినప్పటికీ.. నిత్యం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కాగా గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కాస్త తగ్గింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 455 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,45,406కు పెరగగా.. మరణాల సంఖ్య 3,805 కి చేరింది.
కాగా.. గడిచిన 24 గంటలల్లో వైరస్ బారినపడి 648 మంది కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 6,32,728 కి పెరిగింది. రాష్ట్రంలో 8,873 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 98.03 శాతం ఉండగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 83,763 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 2,20,89,978 మందికి పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read: