Corona: ఆర్మూర్‌లో విషాదం.. కరోనా కాటుకు గంటల వ్యవధిలోనే దంపతులు మృత్యువాత..

Covid-19 Couple Dies: దేశమంతటా కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తోంది. తెలంగాణలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా కారణంగా కుటుంబాలకు

Corona: ఆర్మూర్‌లో విషాదం.. కరోనా కాటుకు గంటల వ్యవధిలోనే దంపతులు మృత్యువాత..
Corona Virus

Updated on: Apr 21, 2021 | 5:04 PM

Covid-19 Couple Dies: దేశమంతటా కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తోంది. తెలంగాణలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా కారణంగా కుటుంబాలకు కుటుంబాలే బలవుతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా చాలా కుటుంబాలు అండను కోల్పోయాయి. ఇటీవల ఈ మ‌హ‌మ్మారి జ‌గిత్యాల‌లో ఒకే కుటుంబంలో ముగ్గురిని.. విజ‌య‌వాడ‌లోని మరో కుటుంబంలో న‌లుగురిని బలి తీసుకుంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో కూడా కరోనా రక్కసి భార్యభర్తలను పొట్టన పెట్టుకుంది. జిల్లాలోని ఆర్మూర్‌లో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తలిద్దరూ ఇలా గంట వ్య‌వ‌ధిలోనే క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

ఆర్మూర్‌కు చెందిన ఎంఐఎం నేత గోరేమియా ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో హైద‌రాబాద్‌లోని ఓ ఆస్ప‌త్రిలో చేరారు. చికిత్స పొందుతూ బుధవారం ఉద‌యం క‌న్నుమూశారు. ఈ నేపథ్యంలోనే ఆయ‌న భార్య‌కు కూడా క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. గోరెమియాను అంత్య‌క్రియల కోసం స్మశాన వాటిక‌కు త‌ర‌లిస్తుండ‌గానే.. ఆయ‌న భార్య కూడా మరణించింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

కాగా.. నిజామాబాద్ జిల్లాలో రోజుకు 400 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు పెద్ద ఎత్తున పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నారు. జిల్లాలో ఒక్కరోజులోనే 110 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణఅయింది. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో నిన్న 6వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 10మంది మరణించారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.

 

Also Read:

టాలీవుడ్‏లో మరో విషాదం…. కరోనాతో సినీ నిర్మాత మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులు..

Telangana Zonal System: తెలంగాణ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. కొత్త జోనల్ వ్య‌వ‌స్థ‌కు రాష్ట్ర‌ప‌తి ఆమోదం..

Loading...
Unable to load recommendations.
Follow Us