కరోనా అప్‌డేట్స్‌.. ఏఏ దేశాల్లో ఎక్కువగా ఉందంటే..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండం చేస్తోంది. మొత్తం 210 దేశాలకు ఈ వైరస్‌ విస్తరించగా.. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 24, 81, 287కు చేరింది.

కరోనా అప్‌డేట్స్‌.. ఏఏ దేశాల్లో ఎక్కువగా ఉందంటే..!

Edited By:

Updated on: Apr 21, 2020 | 9:05 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండం చేస్తోంది. మొత్తం 210 దేశాలకు ఈ వైరస్‌ విస్తరించగా.. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 24, 81, 287కు చేరింది. వీరిలో 1,70,436 మంది మృత్యువాతపడగా.. 6,46,854 మంది కోలుకున్నారు. ఇక దేశాల వారీగా అగ్రరాజ్యం అమెరికాలో 7,92,759 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 72,389 మంది కోలుకోగా.. 42,514 మంది మరణించారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటిన దేశాల్లో అమెరికా తరువాత స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, లండన్‌ దేశాలు ఉన్నాయి. అలాగే 50వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల జాబితాలో టర్కీ, ఇరాన్‌, చైనాలు ఉన్నాయి. ఇక వైరస్‌ పుట్టిన చైనాలో మొన్నటివరకు తగ్గినట్లే కనిపించిన కరోనా.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. ఆ దేశంలో ప్రస్తుతం 82,769 కేసులు ఉన్నాయి. ఇక భారతదేశంలో 18,601 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Read This Story Also: సోషల్ మీడియాలోకి రావడానికి అసలు కారణం చెప్పిన చిరు..!