అక్కడ బ్లీచింగ్ అమ్మకాలు బంద్.. కారణమిదే!

| Edited By:

Apr 19, 2020 | 12:16 PM

అమెరికాలో జెనెసిస్ చర్చిపై అగ్రరాజ్య న్యాయశాఖ చర్యలు చేపట్టింది. తాము రూపొందించిన ఓ బ్లీచింగ్ ఉత్పత్తి కరోనా వైరస్‌కు విరుగు అంటూ చర్చి సభ్యులు చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకుంది. ఆ ఉత్పత్తితో అనేక రోగాలు వస్తాయని.. తక్షణమే బ్లీచింగ్ ఉత్పత్తి..

అక్కడ బ్లీచింగ్ అమ్మకాలు బంద్.. కారణమిదే!
Follow us on

అమెరికాలో జెనెసిస్ చర్చిపై అగ్రరాజ్య న్యాయశాఖ చర్యలు చేపట్టింది. తాము రూపొందించిన ఓ బ్లీచింగ్ ఉత్పత్తి కరోనా వైరస్‌కు విరుగు అంటూ చర్చి సభ్యులు చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకుంది. ఆ ఉత్పత్తితో అనేక రోగాలు వస్తాయని.. తక్షణమే బ్లీచింగ్ ఉత్పత్తి అమ్మకాలను రద్దు చేయాలని అగ్రరాజ్య న్యాయశాఖ.. ఫ్లోరిడా న్యాయస్థానాన్ని కోరింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి.. వాటి అమ్మకాలను, పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.

తాము రూపొందించిన ‘మిరాకిల్ మినరల్ సొల్యూషన్’ కరోనా వైరస్ చికిత్సకు ఉపయోగపడుతుందని ప్రకటించారు ‘జెనెసిస్ 2 చర్చి ఆఫ్ హెల్త్ అండ్ హీలింగ్’ సభ్యులు. కరోనాతో పాటు హెచ్‌ఐవీ ఎయిడ్స్, ఆటిసమ్, బ్రెయిన్ కేన్సర్ వంటి రోగాలకూ ఇదే విరుగుడని పేర్కొన్నారు.

అయితే ఈ మిరాకిల్ మినరల్ సొల్యూషన్’ అనేది ఓ రసాయన ఉత్పత్తి అని, యాక్టివేటర్‌తో కలిపితే శక్తివంతమైన బ్లీచింగ్ ఉత్పత్తి తయారవుతుందని అమెరికా న్యాయశాఖ తెలిపింది. దీనివల్ల వికారం, వాంతులు, అతిసారం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తెలెత్తుతాయని అమెరికా ఆహార-ఔషద విభాగం తేల్చి చెప్పింది. ఈ మేరకు ఉత్పత్తిని నిలిపివేయాలని ఈ నెల 18న జెనెసిస్ సభ్యులకు హెచ్చరికలు చేసినా.. వారు లెక్క చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించింది యూఎస్ న్యాయ శాఖ.

Read More: 

ఇంటర్‌ సెకండ్ ఇయర్ రిజల్ట్స్‌.. టీఎస్ బోర్డు కీలక నిర్ణయం

ఫేస్‌బుక్‌లో అభ్యంతకర వ్యాఖ్యలు.. ‘రక్త చరిత్ర’ నటుడు అరెస్ట్

రేపటి నుంచి లాక్‌డౌన్ సడలింపులు.. ఏం తెరుచుకుంటాయంటే!

84 ఏళ్ల వయసులో కూడా ‘బాలను రా మదనా’ అంటూ జమున డ్యాన్స్