మహారాష్ట్రలో కరోనా కల్లోలం.. దేశంలో నమోదైన కేసులు ఎన్నంటే…

|

Apr 07, 2020 | 8:57 AM

Coronavirus Updates: దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 30 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు పాకింది. ఇప్పటివరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4421కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే 114 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. అటు 326 మంది కోలుకున్నారు. అంతేకాకుండా నిన్న ఒక్క రోజే కొత్తగా 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొలి కేసు నమోదైన తర్వాత.. ఇంత […]

మహారాష్ట్రలో కరోనా కల్లోలం.. దేశంలో నమోదైన కేసులు ఎన్నంటే...
Follow us on

Coronavirus Updates: దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 30 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు పాకింది. ఇప్పటివరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4421కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే 114 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. అటు 326 మంది కోలుకున్నారు. అంతేకాకుండా నిన్న ఒక్క రోజే కొత్తగా 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొలి కేసు నమోదైన తర్వాత.. ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి అని అధికారుల చెబుతున్నారు.

ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కోవిడ్ 19 తీవ్రత ఎక్కువగా ఉంది. అలాగే మహారాష్ట్రలోలో ఈ వైరస్ బారిన పడి ఏకంగా 45 మంది మృత్యువాతపడ్డారు. ఇక ఇదే రాష్ట్రంలో అత్యధిక కేసులు(748) కేసులు కూడా నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం మహారాష్ట్ర-748, కేరళ-327 , కర్ణాటక- 151, తెలంగాణ-321, గుజరాత్-144, రాజస్థాన్-288, యూపీ-305, తమిళనాడు-621, ఢిల్లీ-523, పంజాబ్-76, మధ్యప్రదేశ్‌-165, ఏపీ-266, జమ్ముకశ్మీర్-109, లడాక్-14, హర్యానా-90, హిమాచల్‌ప్రదేశ్-13, పశ్చిమ బెంగాల్-91, ఛండీగర్-18, ఛత్తీస్‌ఘడ్‌-10, పుదుచ్చేరి -5, మిజోరం- 1, మణిపూర్‌-2, గోవా-7, బీహార్ – 32, అస్సాం – 26, ఉత్తరాఖండ్ – 31, ఒడిశా – 21, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 10, జార్ఖండ్ – 4, అరుణాచల్ ప్రదేశ్ – 1 కేసులు ఉన్నాయి.

ఇది చదవండి: కలకలం రేపుతున్న కాకుల మరణాలు.. మిస్టరీ ఏంటంటే.?