ఏపీ: పెద్ద మనసున్న బుడతడు.. సీఎం సహాయనిధికి ‘భారీ’ విరాళం..

|

Apr 07, 2020 | 1:49 PM

Coronavirus Updates: “ఇండియా చూద్దానికి ఎలా ఉన్నా.. బ్ర‌త‌కడానికి బాగుంటుంది” ఇది ప్రముఖ సినీ రచయిత రాసిన డైలాగు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అడ్డం పడుతుంది. కరోనా వైరస్ మహమ్మారి ఇండియాను కమ్మేసిన వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ విధించిన నేపధ్యంలో భారతీయులందరూ ఒక్క తాటిపైకి వచ్చి నిలబడ్డారు. ఎందరో మహానుభావులు, ఆపై వ్యాపార దిగ్గజాలు, సినీ సెలబ్రిటీలు.. ఇలా ఒకరేమిటి అందరూ కూడా మేము సైతం అంటూ డొనేషన్లు చేసి కేంద్రం, […]

ఏపీ: పెద్ద మనసున్న బుడతడు.. సీఎం సహాయనిధికి భారీ విరాళం..
Follow us on

Coronavirus Updates: “ఇండియా చూద్దానికి ఎలా ఉన్నా.. బ్ర‌త‌కడానికి బాగుంటుంది” ఇది ప్రముఖ సినీ రచయిత రాసిన డైలాగు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అడ్డం పడుతుంది. కరోనా వైరస్ మహమ్మారి ఇండియాను కమ్మేసిన వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ విధించిన నేపధ్యంలో భారతీయులందరూ ఒక్క తాటిపైకి వచ్చి నిలబడ్డారు. ఎందరో మహానుభావులు, ఆపై వ్యాపార దిగ్గజాలు, సినీ సెలబ్రిటీలు.. ఇలా ఒకరేమిటి అందరూ కూడా మేము సైతం అంటూ డొనేషన్లు చేసి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పోరాటంలో అండగా నిలిచారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఓ బుడ్డోడు కూడా చేరి తన గొప్ప మనసును చాటుకున్నాడు.

కరోనా భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్న సమయంలో సైకిల్ కొనుక్కోవాలని దాచుకున్న ఓ బుడ్డోడు.. కరోనాపై పోరాటానికి ప్రభుత్వానికి అండగా నిలిచాడు. ఏపీలోని విజయవాడకు చెందిన నాలుగేళ్ల కుర్రాడు హేమంత్ సీఎం సహాయనిధికి తాను దాచుకున్న రూ. 971ని విరాళమిచ్చి.. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఎంత డబ్బు ఉంటే ఏం లాభం.. నలుగురికి సాయం చేయాలన్న మంచి మనసు ఉంటే చాలు..

ఇది చదవండి: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలకు మార్గదర్శకాలు..