గుడ్ న్యూస్.. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది కరోనాను జయించారు..

|

May 21, 2020 | 9:23 PM

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 5,127,251 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 2,044,153 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీనితో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,752,154గా ఉన్నాయి. అటు మహమ్మారి దాడికి 330,944 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కరోనా హాట్ స్పాట్స్‌గా అమెరికా, రష్యా, బ్రెజిల్ దేశాలు మారాయి. ఇక్కడ వైరస్ విలయతాండవం […]

గుడ్ న్యూస్.. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది కరోనాను జయించారు..
Follow us on

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 5,127,251 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 2,044,153 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీనితో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,752,154గా ఉన్నాయి. అటు మహమ్మారి దాడికి 330,944 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు కరోనా హాట్ స్పాట్స్‌గా అమెరికా, రష్యా, బ్రెజిల్ దేశాలు మారాయి. ఇక్కడ వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటివరకు 1,598,334 కేసులు నమోదు కాగా.. ఒక్క న్యూయార్క్‌లోనే 364,249 పాజిటివ్ కేసులు, 28,758 మరణాలు సంభవించాయి. ఇక రష్యాలో 317,554 పాజిటివ్ కేసులు నమోదైతే.. 3,099 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అటు బ్రెజిల్‌లో 294,152 కేసులు, 19,038 మరణాలు నమోదయ్యాయి. ఇక మనదేశంలో కరోనా కేసుల సంఖ్య 114,478కి చేరింది.. అటు మరణాల సంఖ్య 3,465గా నమోదైంది.

Read This: గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సులు బంద్..