ప్రపంచవ్యాప్తంగా 22 మిలియన్లు దాటిన కరోనా కేసులు..

|

Aug 19, 2020 | 6:49 PM

ప్రపంచవ్యాప్తంగా 22,341,273 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 785,103 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 15,074,718 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా 22 మిలియన్లు దాటిన కరోనా కేసులు..
Follow us on

Coronavirus Cases In World: ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశాలన్నీ కూడా దశల వారీగా లాక్ డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 22,341,273 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 785,103 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 15,074,718 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో 2,53,943 పాజిటివ్ కేసులు, 6303 మరణాలు సంభవించాయి. అయితే మరణాల రేటు కంటే రికవరీ రేటు అధికంగా ఉండటంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు.

అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. ప్రస్తుతం అన్ని దేశాలూ లాక్ డౌన్‌ను దశల వారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(5,656,744), మరణాలు(175,105) సంభవించాయి. అటు బ్రెజిల్ లో పాజిటివ్ కేసులు 3,411,872 నమోదు కాగా, మృతుల సంఖ్య 110,019కు చేరింది. ఇక రష్యాలో 937,321 పాజిటివ్ కేసులు, 15,989 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు 2,771,958 నమోదు కాగా, మృతుల సంఖ్య 53,046కి చేరింది.

Also Read: Breaking: మురుగునీటిలో కరోనా వైరస్.. తేల్చేసిన పరిశోధకులు..