కరోనా అప్డేట్: దేశంలో 20 వేలు.. ప్రపంచవ్యాప్తంగా 5.40 లక్షల మరణాలు..

|

Jul 07, 2020 | 11:51 AM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,252 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665కి చేరింది. ఇందులో 2,59,557 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,39,948 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న ఒక్క రోజే వైరస్ బారిన పడి 467 మంది మృతి చెందటంతో మొత్తం […]

కరోనా అప్డేట్: దేశంలో 20 వేలు.. ప్రపంచవ్యాప్తంగా 5.40 లక్షల మరణాలు..
Follow us on

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,252 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665కి చేరింది. ఇందులో 2,59,557 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,39,948 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న ఒక్క రోజే వైరస్ బారిన పడి 467 మంది మృతి చెందటంతో మొత్తం ఇప్పటివరకు కరోనా వల్ల 20,160 మంది మరణించారు.

ఇదిలా ఉంటే దేశంలో ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రతరంగా ఉంది, మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు రెండు లక్షలు దాటగా.. తమిళనాడు, ఢిల్లీలలో కరోనా కేసులు లక్ష దాటాయి. అటు గుజరాత్‌లో 36,772 కేసులు నమోదు కాగా, ఉత్తరప్రదేశ్‌లో 28,636 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 25 వేలు దాటితే.. ఆంధ్రప్రదేశ్‌లో 20,019 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కాగా, కరోనా వైరస్ విజృంభణలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 11,747,381 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 540,836 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. అలాగే 6,741,701 మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో, బ్రెజిల్ రెండోస్థానంలో ఉన్నాయి.