తెలంగాణలో కరోనా కాల్ సెంటర్ సర్వీసులు..!

| Edited By:

Jul 14, 2020 | 6:33 PM

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కరోనా వైరస్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తోంది. కోవిడ్ సోకి హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న వారి కోసం...

తెలంగాణలో కరోనా కాల్ సెంటర్ సర్వీసులు..!
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అందులోనూ హైదరాబాద్ నగరంలో ఈ వైరస్ మరింత టెర్రర్ సృష్టిస్తోంది. ఇప్పటికి పలువురు ప్రజా ప్రతినిధులు, వైద్యులు, పోలీసులు, నటులు కూడా ఈ వైరస్ బారిన పడుతూండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కరోనా వైరస్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తోంది. కోవిడ్ సోకి హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న వారి కోసం తెలంగాణ సర్కార్ టెలీ మెడిసిన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ కరోనా కాల్ సెంటర్ సర్వీస్‌ను కోవిడ్ బాధితులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కాల్ సెంటర్ ద్వారా కరోనా పాజిటివ్ వచ్చి ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కౌల్సింగ్ ఇవ్వనున్నారు. అంతేకాకుండా కాల్ సెంటర్ నుంచి కరోనా రోగులకు ఫోన్ చేసి వారి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. అలాగే కోవిడ్ బాధితులకు ఎలాంటి సందేహాలున్నా 1800 599 4455కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే వారికి ఏ విధమైన సమస్యలున్నా టెలీ మెడిసిన్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అలాగే తెలంగాణ సర్కార్ ఈ సేవలను ఉచితంగా అందిస్తోంది.

Read More:

బీ అలర్ట్.. ఇలా చేస్తే మీ వాట్సాప్ బ్లాక్ అవ్వడం ఖాయం..

ఎంత అమాయకత్వం.. నాలుగేళ్లు అవుతున్నా పాతనోట్లు రద్దైన విషయం తెలీదట..

ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. హాల్ టికెట్ పొందిన వారంతా పాస్..