National Corona Virus: దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా మరణాలు.. గత 24 గంటల్లో వందలోపులోనే మృతి

|

Feb 07, 2021 | 11:10 AM

దేశంలో కరోనా వైరస్ కేసుల నమోదు నిలకడగా సాగుతుంది. తాజాగా 12,059 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం...

National Corona Virus: దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా మరణాలు.. గత 24 గంటల్లో వందలోపులోనే మృతి
Follow us on

National Corona Virus: దేశంలో కరోనా వైరస్ కేసుల నమోదు నిలకడగా సాగుతుంది. తాజాగా 12,059 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,08,26,363కు చేరింది. గత 24గంటల్లో కరోనా నుంచి 11,805 మంది కోలుకుని డిశార్జ్ అయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,05,22,601లకు చేరుకుంది. ఈ వైరస్‌ బారినపడి తాజాగా 78 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మృతుల సంఖ్య 1,54,996కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,48,766 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య సిబ్బంది తెలిపింది.

ఓ వైపు భారీ సంఖ్యలో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 6,95,789 కొవిడ్‌ టెస్టులు చేశామని.. దీంతో ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా మొత్తం టెస్టుల సంఖ్య 20,13,68,378 లకు చేరుకుందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది.

Also Read:

శాస్త్రజ్ఞులకే సవాల్ విసురుతున్న కరోనా.. ప్రపంచంలో భారీ సంఖ్యలో కేసులు నమోదు

భవిష్యత్‌ అంతా విద్యార్థులదే అని టీచర్‌ అవతారమెత్తిన ఎమ్మెల్యే సుంకెరవిశంకర్‌…