లాక్ డౌన్ ఎఫెక్ట్.. భార్య పుట్టింట్లో.. భర్త మాజీ ప్రేయసితో..
కరోనా మాట అటుంచితే.. కేంద్రం విధించిన లాక్ డౌన్ వల్ల ఎన్నో చిత్ర విచిత్రాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా బీహార్‌లో లాక్‌డౌన్ పుణ్యమా అని ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది. తన పుట్టింటికి వెళ్లిన ఓ మహిళ.. లాక్ డౌన్ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీనితో ఆమె భర్త.. మాజీ ప్రేయసితో ప్రేయమాయణం సాగించి ఏకంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ ఉదంతం బీహార్‌లోని పాలిగంజ్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ధీరజ్ […]

కరోనా మాట అటుంచితే.. కేంద్రం విధించిన లాక్ డౌన్ వల్ల ఎన్నో చిత్ర విచిత్రాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా బీహార్‌లో లాక్‌డౌన్ పుణ్యమా అని ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది. తన పుట్టింటికి వెళ్లిన ఓ మహిళ.. లాక్ డౌన్ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీనితో ఆమె భర్త.. మాజీ ప్రేయసితో ప్రేయమాయణం సాగించి ఏకంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ ఉదంతం బీహార్‌లోని పాలిగంజ్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ధీరజ్ కుమార్‌కు కొన్ని నెలల క్రిందటే పెళ్లి జరిగింది. ఇక లాక్ డౌన్ అమలుకు ముందు అతడి భార్య పుట్టింటికి వెళ్ళింది.
ఈలోపు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. ధీరజ్ తన భార్యను రావాలని గట్టిగా పట్టుబట్టాడు. ఆమె తిరిగి భర్త దగ్గరకు రావడానికి ఎంతగానో ప్రయత్నించింది. అయినా కూడా లాభం లేకపోవడంతో పుట్టింటికే పరిమితమైంది. దీనితో ఖాళీగా ఉన్న ధీరజ్ తన మాజీ ప్రేయసితో టచ్‌లోకి వెళ్లడమే కాకుండా ఏకంగా పెళ్లి కూడా చేసేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య పోలీసులను ఆశ్రయించగా.. వారు ధీరజ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇక విచారణలో పలు నిజాలు బయటికి వచ్చాయి. ధీరజ్ ఇష్టం లేకుండానే పెళ్లి జరిగిందని.. భార్య దూరంగా ఉండటంతో మళ్లీ మాజీ ప్రేయసితో బంధం బలపడిందని.. అందుకే భవిష్యత్తు పరిణామాలు గురించి ఆలోచించకుండా ఇరువురూ పెళ్లి చేసుకున్నారని విచారణలో తేలినట్లు తెలుస్తోంది.
Also Read:
హిందు, జైనులపై విమర్శలు, ముస్లింలకు నో ఎంట్రీ.. క్యాన్సర్ ఆస్పత్రి నిర్వాకం..
లాక్‌డౌన్ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..
కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?
చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో లాక్ డౌన్ మరింత కఠినతరం..
అత్యవసర ప్రయాణాల కోసం ఈ-పాస్‌లు.. తెలంగాణ సర్కార్ కొత్త నిర్ణయం..
డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్…
కరోనా ఎఫెక్ట్…నో షేవింగ్..నో కట్టింగ్ కాదని వెళితే తప్పదు భారీ మూల్యం.!
