వేడి ఉన్నా ఆగని కరోనా.. తేల్చిన డాక్టర్లు! వీటిని తప్పక పాటించండి

| Edited By:

Mar 03, 2020 | 5:16 PM

ఎక్కువ వేడి ఉంటే.. కరోనా రాదని మనం అనుకున్నాం. కానీ అది ముమ్మాటికీ నిజం కాదని డాక్టర్లు అంటున్నారు. సౌదీ అరేబియా వంటి హీట్ దేశంలోనే కరోనా సోకిందంటే.. ఇండియాలోను కూడా వచ్చే అవకాశం..

వేడి ఉన్నా ఆగని కరోనా.. తేల్చిన డాక్టర్లు! వీటిని తప్పక పాటించండి
Follow us on

ఎక్కువ వేడి ఉంటే.. కరోనా రాదని మనం అనుకున్నాం. కానీ అది ముమ్మాటికీ నిజం కాదని డాక్టర్లు అంటున్నారు. సౌదీ అరేబియా వంటి హీట్ దేశంలోనే కరోనా సోకిందంటే.. ఇండియాలోను కూడా వచ్చే అవకాశం లేకపోలేదన్నారు. ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చేవారిలో కరోనా ఉంటే.. అది వేరే వాళ్లకు వ్యాప్తి చెందుతుందని అంటున్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్.. భారత దేశంలోనూ విజృంభనకు రెడీ అయ్యింది. మొన్నటిదాకా ఇండియాలో కరనా వైరస్ ముగ్గురికే ఉందనీ, వాళ్లు కూడా రికవరీ అవుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ 3 కాస్తా.. 6 అయ్యింది. ఒకరు దేశ రాజధాని ఢిల్లీలో, మరొకరు జైపూర్‌లో ఉండగా.. ఇంకొకరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లో హైలెర్ట్ చేశారు అధికారులు. అలాగే పలువురు సెలెబ్రెటీస్ కూడా కరోనా గురించి పలు రకాల సూచనలు  చేస్తున్నారు. అయితే కరోనా రాకుండా ఉండేందుకు ఈ క్రింది ముఖ్యమైన పాయింట్లను పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే నిజంగానే కరోనా బారి నుంచి మనం తప్పించుకోవచ్చు.

పాయింట్ నెంబర్ 1: కరోనా వ్యాధి ఎలా వస్తుందో తెలిస్తే.. అది మనకు రాకుండా జాగ్రత్త పడగలం. అందులో మొదటిది. బయట వస్తువులను తాకరాదు. షాపింగ్ మాల్స్‌లో, బస్సుల్లో, ఆటోల్లో, రైళ్లల్లో, విమానాల్లో.. వస్తువులను మనం తాకకుండా ఉండాలి. ప్రయాణ సమయంలో హ్యాండ్ శానిటైజర్ వాడటం మంచి సూచన.

పాయింట్ నెంబర్ 2: గాలీ ద్వారా కరోనా సోకదు. ఇది గాలి ద్వారా సోకే వైరస్ కాదు. గుంపుగా జనం ఉన్నా.. ఆ గాలిలో కోవిడ్ ఉండదు. కానీ ఆ జనంలో ఎవరికో ఒకరికి కరోనా ఉంటే మాత్రం.. అప్పుడు వచ్చే ప్రమాదం ఉంది. వారు తుమ్మినా, దగ్గినా, తాకినా.. ఎదుట వారికి కరోనా సోకే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ముందు జాగ్రత్తగానే మాస్క్‌లను వాడండి.

పాయింట్ నెంబర్ 3: ఇప్పుడు కరోనా ప్రభలుతున్న సమయం కాబట్టి.. బయట దొరికే ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది.

పాయింట్ నెంబర్ 4: కరోనా వైరస్ ఉన్నవారికి మనం దాదాపు 200 మీటర్ల దూరంలో ఉండాలి. అలాగే మనలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. శక్తి పెరగాలంటే.. పండ్లు, ఆకు కూరలు, ముఖ్యంగా సీ విటమిన్ ఉన్నవి అయితే మరీ మంచివి.

పాయింట్ నెంబర్ 5: ఎల్లప్పుడూ చేతులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే కాస్త జలుబు, దగ్గు, నీరసం, ఆయసం ఉన్నవారికి ఈ వైరస్ వెంటనే సోకుతుంది. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించడం బెటర్.

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా సోకితే.. నిరుత్సాహ పడకూడదు. మనో ధైర్యంతో.. ఖచ్చితంగా మనం రికవరీ అవుతామని నమ్మకంతో ఉండాలి. ధైర్యం పెరిగే కొద్దీ.. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

Read More: డిగ్రీ విద్యార్థినిపై భర్త అత్యాచారం.. దిశ యాప్‌తో పట్టించిన భార్య