Coronavirus: కరోనా నుంచి కోలుకున్న యువరాజు..!

కరోనా మహమ్మారి నుంచి బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్‌ కోలుకున్నారు. కరోనా పాజిటివ్‌గా తేలిన ఏడు రోజుల తరువాత క్వారంటైన్‌లోకి వెళ్లిన ఛార్లెస్..

Coronavirus: కరోనా నుంచి కోలుకున్న యువరాజు..!

Updated on: Mar 30, 2020 | 10:54 PM

కరోనా మహమ్మారి నుంచి బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్‌ కోలుకున్నారు. కరోనా పాజిటివ్‌గా తేలిన ఏడు రోజుల తరువాత క్వారంటైన్‌లోకి వెళ్లిన ఛార్లెస్.. సోమవారం బయటకు వచ్చినట్లు రాజప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఛార్లెస్ ఇంటి నుంచే ఆయన పని చేస్తున్నట్లు క్లారెన్స్‌ హౌస్ తెలిపింది. ఇదిలా ఉంటే బ్రిటన్‌ ప్రధాని, ఆరోగ్యశాఖ మంత్రికి కూడా కరోనా సోకగా.. ప్రస్తుతం వారు ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే బ్రిటన్‌ రాణి ఎలిజిబెత్‌ 2తో పాటు ఆమె భర్త ఫిలిప్‌ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బ్రిటన్‌లో కరోనా బాధితుల సంఖ్య 22వేల పైకి చేరగా.. వెయ్యి మందికి పైగా మృత్యువాతపడ్డారు. కరోనా నేపథ్యంలో బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.

Read This Story Also: Breaking: తెలంగాణలో కరోనాతో రెండో మృతి..!

Read This Story Also: Breaking: తెలంగాణలో కరోనాతో రెండో మృతి..!

Loading...
Unable to load recommendations.
Follow Us