
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం.. గత మూడు నాలుగు రోజులుగా కేసులు తగ్గుతూ.. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా బుధవారం రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాల బులిటెన్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవాళ కొత్తగా 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1016కు చేరింది. ఇక ఇప్పటి వరకు ఈ కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రోజురోజుకు కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇవాళ ఒక్కరోజే 35 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వారంతా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 409కి చేరింది. ప్రస్తుతం 582 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు.
Media bulletin
Date: April 29, 2020Status of positive cases of #COVID19 and also a list of districts with zero active cases in Telangana. pic.twitter.com/ReCz4nD4qb
— Minister for Health Telangana State (@TelanganaHealth) April 29, 2020