తెలంగాణ ప్రజలకు శుభవార్త.. తాజా కరోనా రిపోర్ట్స్‌ చూస్తే సంబరమే..

కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో దాదాపు రెండు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మన దేశంలో కూడా రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మూడో రోజు కూడా కరోనా కేసుల సంఖ్య తగ్గింది. అదే సమయంలో కరోనా బారినపడ్డ వారు కోలుకుంటూ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. తాజాగా మంగళవారం నమోదైన […]

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. తాజా కరోనా రిపోర్ట్స్‌ చూస్తే సంబరమే..

Edited By:

Updated on: Apr 28, 2020 | 7:41 PM

కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో దాదాపు రెండు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మన దేశంలో కూడా రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మూడో రోజు కూడా కరోనా కేసుల సంఖ్య తగ్గింది. అదే సమయంలో కరోనా బారినపడ్డ వారు కోలుకుంటూ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు.

తాజాగా మంగళవారం నమోదైన కేసుల వివరాల బులిటెన్‌ను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ విడుదల చేశారు. కొత్తగా మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1009కి చేరింది. ఇక వీరిలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారిని 374 మంది జయించి.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇక ఈ వైరస్ బారినపడి 25 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మంగళ వారం ఒక్క రోజే 42మంది డిశ్చార్జి అయ్యారని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 610 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 50శాతానికి పైగా కేసులు.. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదైనట్టు ఈటల తెలిపారు.