తెలంగాణలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా శనివారం మరో 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 809 కేసులు నమోదయ్యాయి. శనివారం నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పేరేషన్ పరిధిలోనివేనని తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 31 కేసులు నమోదయ్యాయి. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో 7, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో 2 […]

తెలంగాణలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే..

Edited By:

Updated on: Apr 18, 2020 | 10:20 PM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా శనివారం మరో 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 809 కేసులు నమోదయ్యాయి. శనివారం నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పేరేషన్ పరిధిలోనివేనని తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 31 కేసులు నమోదయ్యాయి. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో 7, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో 2 కేసులు, నల్గొండ జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

కాగా.. ప్రస్తుతం 605 కేసులు యాక్టివ్‌లో ఉండగా.. 186 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లోనే 448 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.