చైనాలో పుట్టిన కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి దాని చుట్టుపక్కల దేశాలకు విస్తరించి మరణ మృదంగం వాయిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఒక లక్షా 17,339 మంది వైరస్‌బారిన పడగా.. 4,251 మంది మృతి చెందారు. ఇటలీలో ఒక్కరోజునే 168 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రోజురోజుకు విస్తరిస్తూ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కొవిడ్ ఎఫెక్ట్ పలు రంగాలపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది.
చైనాలో తీసుకున్న పటిష్టమైన చర్యలతో ఈ వైరస్ బారిన పడే వారి సంఖ్య తగ్గిపోయింది. కొత్త కేసులు మరణాలు వెలుగుచూడడం లేదు. అయితే యూరప్ సహా చైనా పక్కనున్న దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనా తర్వాత కరోనా వైరస్ ఇటలీ ఇరాన్ దక్షిణ కొరియా దేశాల్లో ప్రభావం బాగా ఉంది. చాలా మంది ఈ దేశాల్లో చనిపోయారు. అయితే ఒక వ్యక్తికి కరోనా సోకిందని ఉత్తర కొరియాలో అతడిని కాల్చిచంపారని వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ కరోనా వైరస్ కారణంగా 200 మంది ఉత్తరకొరియా సైనికులు చనిపోయారన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. జనవరి ఫిబ్రవరి నెలల్లో 200 మందికి పైగా సైనికులు చనిపోయారు. మరో 3700మందిని దిగ్బంధించి చికిత్స కేంద్రాలకు తరలించారట.. చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులే ఈ కరోనా బారిన పడ్డారని ఫిబ్రవరి వరకే 200 మంది సైనికులు చనిపోయారని అక్కడి వార్త పత్రిక తెలిపింది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ తొక్కేశాడని దక్షిణ కొరియా వార్త సంస్థ ప్రచురించిన కథనం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.