కేరళ గవర్నమెంట్ కొత్త స్కీమ్.. ఇక అన్ని సేవలూ హోం డెలివరీనే

17 కరోనా పాజిటివ్ కేసులతో సతమతవుతోన్న కేరళ.. ఇంటికే సర్వీసులు అందిస్తుంది. ఆహార పదార్థాలు, నిత్యావసరాలను స్థానిక పంచాయతీ పర్యావేక్షణలో ఇంటింటికీ డెలివరీ చేయిస్తుంది. ఇతర రాష్ట్రాలకు ప్రయాణాలకు రద్దు చేయడమే కాకుండా..

కేరళ గవర్నమెంట్ కొత్త స్కీమ్.. ఇక అన్ని సేవలూ హోం డెలివరీనే

Edited By:

Updated on: Mar 13, 2020 | 10:16 AM

కరోనా.. కరోనా.. ఎక్కడ విన్నా ఇదే మాట.. ప్రజల్లో భయాందోళనను సృష్టిస్తుంది. కాగా.. ఆఫీసుల్లో.. బస్సుల్లో.. స్కూళ్లల్లో.. ఏ ఒక్కరు తుమ్మినా.. దగ్గినా.. అందరూ వారివైపే కళ్లప్పగించి చూస్తున్నారు. ఇక ఒక్క ఆఫీసులో కరోనా వచ్చిందంటే.. ఆఫీసులకు తాళాలు పడాల్సిందే. అందుకే డబ్ల్యూహెచ్ఓ కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. దీంతో భారత ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే ఈ మేరకు కేరళ ప్రభుత్వం ఆహారంతో పాటు.. కొన్ని సేవలను హోం డెలివరీ చేసేందుకు సిద్ధమవుతోంది. కరోనా వ్యాప్తి నియంత్రించే దిశగా అత్యవసరం జాగ్రత్తలు తీసుకుంటుంది.

17 కరోనా పాజిటివ్ కేసులతో సతమతవుతోన్న కేరళ.. ఇంటికే సర్వీసులు అందిస్తుంది. ఆహార పదార్థాలు, నిత్యావసరాలను స్థానిక పంచాయతీ పర్యావేక్షణలో ఇంటింటికీ డెలివరీ చేయిస్తుంది. ఇతర రాష్ట్రాలకు ప్రయాణాలకు రద్దు చేయడమే కాకుండా.. అత్యవసరంగా బయట పనులపై వెళ్లే వారికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. కాగా.. కరోనా భయం ఉన్నా.. ఇప్పటికీ ప్రజలు, ఆహారం, నీరు, ఇతర అవసరాల కోసం బయటకి వస్తున్నారు. దీంతో వాళ్లు ఇబ్బంది పడకుండా.. కరోనా ఎఫెక్ట్ పడకుండా.. కేరళ ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుంది.

అలాగే… సేవల్లో నాణ్యత పెంచేందుకు 24 గంటల కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. బ్రాడ్ బ్యాండ్‌లో క్వాలిటీ ఉండేలా చూస్తున్నారు. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే ట్విట్టర్ ద్వారా ప్రజలకు జాగ్రత్తలను సూచిస్తున్నారు. అంతేకాకుండా.. వర్క్ ఫ్రమ్ హోమ్.. ద్వారా వర్క్ చేసేవారికి బెస్ట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నారు.

Read More this also: వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్

మహిళా సీఐపై చేయి చేసుకున్న వైసీపీ నేత..

హీరో, హీరోయిన్‌కు కరోనా.. షాక్‌లో సినీ ఇండస్ట్రీ

మరో 10 రోజుల్లో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు

బ్రేకింగ్: ఇటలీలో చిక్కుకున్న విద్యార్థులకు విముక్తి.. కేంద్రం ప్రత్యేక సాయం