వినాయ‌క చందాల‌తో క‌రోనా ఐసోలేష‌న్ సెంట‌ర్ ఏర్పాటు !

|

Jun 15, 2020 | 11:08 AM

క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించి ఆస్పత్రిలో చేరాల్సిన అవ‌స‌రం లేనివారి కోసం బ్లూబెల్స్ సొసైటీ వారు ప్ర‌త్యేకించి స్థానికంగానే ఓ ఐసోలేష‌న్ సెంట‌ర్‌ని ఏర్పాటు చేశారు. గణపతి ఉత్స‌వాల‌ను నిర్వ‌హిచేందుకు సేకరించిన డబ్బుతో కోవిడ్‌-19 ఐసోలేషన్ సెంటర్‌ను..

వినాయ‌క చందాల‌తో క‌రోనా ఐసోలేష‌న్ సెంట‌ర్ ఏర్పాటు !
Follow us on

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గ‌త రెండు రోజులుగా రోజుకు 12వేల మార్క్‌ను దాటి పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌టం ఆందోళ‌న రేపుతోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో లక్ష మార్క్‌ను దాటేసింది.  ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 3950కి చేరింది. ఇక రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతుండటం కలకలం రేపుతోంది. ఇటువంటి త‌రుణంలో ఔరంగ‌బాద్‌లోని ఓ సొసైటీ స‌భ్యులు తీసుకున్న నిర్ణ‌యం అంద‌రికి ఆద‌ర్శంగా నిలుస్తోంది.

క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించి ఆస్పత్రిలో చేరాల్సిన అవ‌స‌రం లేనివారి కోసం బ్లూబెల్స్ సొసైటీ వారు ప్ర‌త్యేకించి స్థానికంగానే ఓ ఐసోలేష‌న్ సెంట‌ర్‌ని ఏర్పాటు చేశారు. ఔరంగాబాద్ ప్రాంతానికి చెందిన బ్లూ బెల్స్ సొసైటీ గణపతి ఉత్స‌వాల‌ను నిర్వ‌హిచేందుకు సేకరించిన డబ్బుతో కోవిడ్‌-19 ఐసోలేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో 20 ప‌డ‌క‌ల‌ను అందుబాటులో ఉంచారు. ఈ ఐసోలేష‌న్ సెంట‌ర్‌లో కరోనా వైరస్ సంక్రమణ లక్షణాలు త‌క్కువ‌గా ఉన్న‌వారు, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేనివారి కోసం ఉప‌యోగిస్తామ‌ని సొసైటీ స‌భ్యులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ క్వారంటైన్ సెంట‌ర్ రూపొందించామ‌ని, బాధితుల‌కు సేవ‌లందిస్తున్న‌ డాక్టర్ దీపక్ కార్వా చెప్పారు. ఇక్క‌డి కోవిడ్ ఐసోలేష‌న్ సెంట‌ర్ సహాయంతో ఆసుపత్రులపై భారం తగ్గుతుందని అన్నారు.