India Coronavirus tests: భారత్ కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రపంచంలోని దేశాలన్నీంటిలో అతి తక్కువ సమయంలో 54లక్షల మందికి టీకా ఇచ్చి ముందు వరుసలో ఉంది. ఈ క్రమంలోనే కరోనావైరస్ టెస్టుల్లో భారత్ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు చేసిన కరోనావైరస్ పరీక్షల సంఖ్య 20 కోట్లు దాటి మళ్లీ రికార్డుల్లోకెక్కింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ శనివారం టెస్టుల వివరాలను వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 20 కోట్ల టెస్టులు చేయగా.. వాటిలో 7.40లక్షల టెస్టులు గడిచిన 24 గంటల్లో (శుక్రవారం) చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో ప్రస్తుతం 2,369 టెస్టింగ్ ల్యాబ్‌లు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ ల్యాబ్‌లు 1,214 ఉండగా.. ప్రైవేటు ల్యాబ్‌లు 1,155 ఉన్నాయి. టెస్టింగ్ ల్యాబ్‌లు పెరగడం మూలంగా ఇటీవల కాలంలో నిత్యం 10లక్షలకు పైగా నిర్థారణ పరీక్షలు చేశారు. దీంతోపాటు ఒకానొక దశలో రోజువారిగా 15లక్షల టెస్టులు సైతం చేశారు.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీంతో దేశంలో కరోనా క్యుములేటివ్ పాజిటివిటీ రేటు 5.39 శాతానికి చేరింది. కరోనా రికవరీ రేటు 97.19 శాతం ఉండగా.. మరణాల రేటు 1.43 శాతంగా ఉంది. ఫలితంగా ప్రస్తుతం దేశంలో 1.48లక్షల పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read: