కరోనా కల్లోలం.. గుజరాత్‌లో 925.. రాజస్థాన్‌లో 866 కేసులు

| Edited By:

Jul 15, 2020 | 11:22 PM

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలంతా వణికిపోతున్నారు. గుజరాత్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా..

కరోనా కల్లోలం.. గుజరాత్‌లో 925.. రాజస్థాన్‌లో 866 కేసులు
Follow us on

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలంతా వణికిపోతున్నారు. గుజరాత్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా బుధవారం నాడు గుజరాత్‌లో కొత్తగా మరో 925 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో
నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44,648కి చేరింది. వీటిలో 31,346 మది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని గుజరాత్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడింది.

ఇక రాజస్థాన్‌లో కూడా కరోనా కేసులు 26 వేల మార్క్‌ను దాటి.. 27 వేలకు చేరువవుతున్నాయి. బుధవారం నాడు కొత్తగా మరో 866 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 26,437కి చేరింది. వీటిలో 19,502 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.ఈ విషయాన్ని రాజస్థాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 6,405 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.