Coronavirus: మళ్లీ కోరలు చాస్తోన్న కరోనా.. ఆ క్యాంపస్‌లో 25 మంది విద్యార్థులకు పాజిటివ్‌..

| Edited By: Anil kumar poka

Apr 24, 2022 | 8:42 AM

India Covid-19: తగ్గిపోయిందనుకున్న కరోనా మహమ్మారి (Coronavirus) మళ్లీ కోరలు చాస్తోంది. నాలుగో వేవ్‌ ఊహాగానాలను నిజం చేస్తూ దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ఇబ్బడిముబ్బడిగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి

Coronavirus: మళ్లీ కోరలు చాస్తోన్న కరోనా.. ఆ క్యాంపస్‌లో 25 మంది విద్యార్థులకు పాజిటివ్‌..
Coronavirus
Follow us on

India Covid-19: తగ్గిపోయిందనుకున్న కరోనా మహమ్మారి (Coronavirus) మళ్లీ కోరలు చాస్తోంది. నాలుగో వేవ్‌ ఊహాగానాలను నిజం చేస్తూ దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ఇబ్బడిముబ్బడిగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇక దేశంలో రోజువారీ కొత్త కేసులు కూడా రెండువేల మార్కును దాటిపోవడం దేశంలో వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. ఇదిలా ఉంటే మద్రాస్‌ ఐఐటీ (IIT Madras) క్యాంపస్‌ కొవిడ్‌ హాట్‌స్పాట్‌గా మారింది. గత కొన్ని రోజులుగా అక్కడ పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. శనివారం మరో 25 మంది విద్యార్థులు వైరస్‌ బారిన పడ్డారు. దీంతో క్యాంపస్‌లో ఇప్పటివరకు 55 కరోనా కేసులు వెలుగుచూసినట్లు తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. కాగా తమిళనాడు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌ ఐఐటీ క్యాంపస్‌ను తనిఖీ చేశారు. అక్కడ వివిధ హాస్టళ్లలో ఉండే విద్యార్థులను కలిసి ధైర్యం చెప్పారు.

స్వల్ప లక్షణాలే.. అయినా..

‘మద్రాస్‌ ఐఐటీ క్యాంపస్‌లో ఇప్పటివరకు 55 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. బాధితుల శాంపిల్స్‌ అన్నింటినీ జీనోమిక్‌ సీక్వెన్సింగ్‌ విశ్లేషణ కోసం పంపాం. త్వరలోనే నివేదికలు వస్తాయి. క్యాంపస్‌లో కేసులు పెరుగుతున్నాయని ఎవరూ భయపడొద్దు.. విద్యార్థుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడికి మూడు కి.మీల పరిధిలో ఉన్న ఆస్పత్రిని రిజర్వు చేశాం. బాధితులందరిలోనూ స్వల్ప లక్షణాలే ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదు. అలాగనీ అతి విశ్వాసం పనికిరాదు. వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించుకుంటూ ఉండండి. ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వండి’ అని రాధాకృష్ణన్‌ సూచించారు.

Also Read: Megastar Chiranjeevi: తెలుగు సినిమా ఇండియన్‌ సినిమా అని గర్వపడేలా చేశారు.. దర్శకధీరుడిపై మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..

AP Summer Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులను ప్రకటించిన ప్రభుత్వం.. ఎప్పటి నుంచి అంటే..

TOP 9 ET News: దెబ్బకు దండం పెట్టిన సింగర్ సునీత | 1100 కోట్ల క్లబ్‌లోకి RRR