క‌రోనా అల‌ర్ట్ః గాలిలో వైర‌స్‌ వ్యాప్తి…13 అడుగుల వరకు

| Edited By: Pardhasaradhi Peri

Apr 12, 2020 | 2:18 PM

కోవిడ్‌-19 ఈ పేరు వింటేనే ప్ర‌పంచ దేశాలు వ‌ణికిపోతున్నాయి. భార‌త్‌ను కూడా గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ఈ వైర‌స్ గురించిన మ‌రో షాకింగ్ న్యూస్ ఇప్పుడు మ‌రింత భ‌య‌పెడుతోంది. ఇంత‌వ‌ర‌కు ..

క‌రోనా అల‌ర్ట్ః గాలిలో వైర‌స్‌ వ్యాప్తి...13 అడుగుల వరకు
Follow us on

కోవిడ్‌-19 ఈ పేరు వింటేనే ప్ర‌పంచ దేశాలు వ‌ణికిపోతున్నాయి. భార‌త్‌ను కూడా గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ఈ వైర‌స్ గురించిన మ‌రో షాకింగ్ న్యూస్ ఇప్పుడు మ‌రింత భ‌య‌పెడుతోంది. ఇంత‌వ‌ర‌కు వైర‌స్ సోకిన మ‌నిషికి ద‌గ్గ‌ర ఉండి, స‌న్నిహితంగా మెలిగేతేనే సంక్ర‌మిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే, తాజా అధ్య‌య‌నం ప్ర‌కారం గాల్లోనూ వైర‌స్ వ్యాప్తిస్తోంద‌నే వార్త‌లు ఆందోళ‌న రేపుతున్నాయి.

 

చైనా… బీజింగ్‌లోని అకాడమీ ఆఫ్‌ మిలిటరీ మెడికల్ సైన్స్‌కు చెందిన పరిశోధకులు క‌రోనా వైర‌స్‌పై ఇప్పుడు మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. వుహాన్‌లోని ఓ ఆస్పత్రిలో కొవిడ్‌ జనరల్‌, ICU నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. 13 అడుగులు లేదా నాలుగు మీటర్ల దాకా వైరస్‌ గాలిలో తేలుతూ ప్రయాణించ‌గ‌ల‌ద‌నే వాస్త‌వాన్ని తేల్చారు. అయితే, కరోనా సోకిన పేషెంట్ల నుంచి వైరస్‌ 13 అడుగుల వరకు వ్యాపిస్తోందని, చెబుతూనే..మ‌రోవైపు గాలిలో వచ్చే వైరస్ 13 అడుగుల దూరంలో ఉండే వారికి సోకే అవకాశాలు తక్కువేన‌ని చెబుతున్నారు. ఈ మేర‌కు చైనా శాస్త్రవేత్తల పరిశోధన వివరాల్ని యుఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌కు చెందిన ‘ఎమర్జింగ్‌ ఇన్ఫెక్షస్‌ డిసీజెస్ జర్నల్‌లో ప్ర‌చురించారు.

 

ఆ నివేదిక ప్ర‌కారం..ఆస్పత్రి వార్డుల్లోని ఫ్లోర్‌లపైనే వైరస్‌ ఎక్కువగా ఉండటాన్ని ప‌రిశోధ‌కులు గుర్తించార‌ట‌. కరోనా పేషెంట్ చుట్టుపక్కల అంటే,.. బెడ్‌కు ఉండే ఇనుపకమ్మీలు, ఉమ్మితొట్టె పైభాగం, తలుపు గడియపై వైరస్‌ ఎక్కువగా ఉంద‌ట‌. ICU సిబ్బంది బూట్లపై పడిన తుంపర్లలో కరోనా వైరస్ ఉండటం వాళ్లు గుర్తించార‌ట‌. దీనిని బ‌ట్టి క‌రోనా వైర‌స్ గాల్లో ప్ర‌యాణించ‌గ‌ల‌గుతుంద‌ని వారు నిర్దారించారు. అంటే ఎవరైనా దగ్గినా, తుమ్మినా… ఆ తుంపర్లు గాలిలో ఎగురుతూ వెళ్తాయి. గాలి లేకపోతే… తుంపర్లు నేలపై పడిన‌ట్లు వారు గ‌మ‌నించారు. ఈ మేర‌కు తాజా అధ్య‌య‌నం ప్ర‌కారం…సోషల్ డిస్టాన్స్‌లో కనీసం 8 అడుగుల దూరం ఉండమంటున్నారు. అంతకన్నా దగ్గగగా ఉంటే… కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.