చికెన్ ప్రియుల కోసం…కోళ్లు ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..

| Edited By: Ravi Kiran

Mar 13, 2020 | 9:31 AM

కరోనా వైరస్ వదంతులతో రోజురోజుకు చికెన్ ధరలు పడిపోతున్నాయి. గత నెల రోజుల నుంచి అమాంతం తగ్గుతూ వస్తోన్నాయి. కరోనా ఎఫెక్ట్ వల్ల చికెన్ కంటే రైతు బజారులో కూరగాయల ధరలే ఎక్కువగా ఉంటున్నాయి...

చికెన్ ప్రియుల కోసం...కోళ్లు ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..
Follow us on

కోవిడ్‌-19 ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచదేశాల్లో వేగంగా విస్తరిస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది. దీంతోపాటు కరోనా వైరస్‌ ఆందోళనలు అనేక రంగాలపై తీవ్రంగా ప్రభవం చూపుతున్నాయి. కరోనా వైరస్ వదంతులతో రోజురోజుకు చికెన్ ధరలు పడిపోతున్నాయి. గత నెల రోజుల నుంచి అమాంతం తగ్గుతూ వస్తోన్నాయి. కరోనా ఎఫెక్ట్ వల్ల చికెన్ కంటే రైతు బజారులో కూరగాయల ధరలే ఎక్కువగా ఉంటున్నాయి.

కరోనా ప్రభావంతో కోళ్ల విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. ఒక కోడి తీసుకుంటే మరో కోడి ఉచితం అంటూ పలుచోట్ల బోర్డులు దర్శనమిస్తున్నాయి. కర్నాటకలోని బనశంకరిలో చికెన్ ధరలు పాతళానికి పడిపోయాయి. ఒక కోడి రూ. 8 మాత్రమేనని చికెన్‌ దుకాణల వద్ద బోర్డులు పెట్టారు. అటు కొన్ని చోట్ల కోళ్లను ఫ్రీగా కూడా ఇచ్చేస్తున్నారు. గురువారం కరావళి ప్రాంతమైన పుత్తూరులో చికెన్‌ ధరలు ఆశ్చర్యం కలిగించగా హెచ్‌1 ఎన్‌1 నేపథ్యంలో కూడా చికెన్‌ ధరల్లో భారీ తగ్గుముఖం కనబడింది. కరోనా, హెచ్‌1ఎన్‌1 భయంతో కోళ్ల ధరలు కిలో 8 రూపాయలకు ఊహించని విధంగా పడిపోయింది.