ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలకు మార్గదర్శకాలు..

|

Apr 07, 2020 | 10:20 AM

Coronavirus Effect: రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనాలు ఎక్కువగా గుమిగూడే సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులు, ఫార్మసీలకు దిశానిర్దేశాలను జారీ చేసింది. కరోనాను కట్టడి చేసే క్రమంలో భాగంగా ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని పేర్కొంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 303 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్ అమలు చేసిన దిశనిర్దేశాలు.. స్టోర్లలో పని చేసేవారికి ఎవరికైన ఫ్లూ, కరోనా […]

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలకు మార్గదర్శకాలు..
Follow us on

Coronavirus Effect: రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనాలు ఎక్కువగా గుమిగూడే సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులు, ఫార్మసీలకు దిశానిర్దేశాలను జారీ చేసింది. కరోనాను కట్టడి చేసే క్రమంలో భాగంగా ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని పేర్కొంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 303 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

ఏపీ సర్కార్ అమలు చేసిన దిశనిర్దేశాలు..

  • స్టోర్లలో పని చేసేవారికి ఎవరికైన ఫ్లూ, కరోనా వైరస్ లక్షణాలు ఉంటే వారు రాకూడదు
  • స్టోర్‌లలో రద్దీని తగ్గించేందుకు తగిన చర్యలు చేపట్టాలి
  • వినియోగదారులు సరుకులను రెండు వారాలకు మించి కొనకుండా చర్యలు తీసుకోవాలి
  • కస్టమర్ల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి
  • క్యూ లైన్లలో సామాజిక దూరం పాటించాలి. అంతేకాక 2 మీటర్లు లేదా 6 అడుగుల దూరం ఉండేలా గుర్తులు వేయాలి
  • పార్కింగ్ సౌకర్యం ఉన్న దుకాణాలు.. కస్టమర్లకు ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా టోకెన్ విధానాన్ని అమలు చేయాలి.
  • ఆన్లైన్ షాపింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి.. సరకులను డోర్ డెలివరీ చేయాలి
  • ఎప్పటికప్పుడు పని చేసేవారి బాడీ టెంపరేచర్ చెక్ చేయడమే కాకుండా స్టోర్‌లలో ఇన్‌, ఔట్ దగ్గర హ్యాండ్ శానిటైజర్‌ను ఏర్పాటు చేయాలి
  • క్యాష్ కౌంటర్ల దగ్గర ఉండేవారు మాస్కులు, గ్లౌజులు ధరించాలి
  • ఆన్లైన్ చెల్లింపులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ పక్షంలో కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు వలల ద్వారా తీసుకోవాలి.

ఇది చదవండి: కరోనా ఎఫెక్ట్.. ఏపీలో జూన్ 11 వరకు పాఠశాలలు క్లోజ్.!