తిరుపతిలో కరోనా విజ‌ృంభణ..350 యాక్టివ్ కేసులు!

|

Jul 08, 2020 | 2:27 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. చిత్తూరు జిల్లాలు వణికిస్తున్న వైరస్ మహమ్మారి ..ఆధ్యాత్మీక క్షేత్రం తిరుమలలోనూ జడలు విప్పుకుంటోంది. తిరుపతిలో వైరస్ వ్యాప్తిపై..

తిరుపతిలో కరోనా విజ‌ృంభణ..350 యాక్టివ్ కేసులు!
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. చిత్తూరు జిల్లాలు వణికిస్తున్న వైరస్ మహమ్మారి ..ఆధ్యాత్మీక క్షేత్రం తిరుమలలోనూ జడలు విప్పుకుంటోంది. తిరుపతిలో వైరస్ వ్యాప్తిపై మున్సిపల్ కమిషనర్ గిరీష్ ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తిలో ఉందని గిరీష పేర్కొన్నారు.

తిరుపతి వ్యాప్తంగా 50 డివిజన్లుకు గాను 40 డివిజన్లలో రెడ్‌ జోన్స్ ఉన్నాయని చెప్పారు. ఒక్క తిరుపతి నగరంలోనే 350 కరోనా యాక్టివ్‌లు ఉన్నాయని, మంగళవారం ఒక్కరోజే తిరుపతి నగరంలో 70 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు కమిషనర్ గిరీష్ వెల్లడించారు. కరోనా బారినపడిన వారిలో టీటీడీ ఉద్యోగులు సైతం ఉన్నారని తెలిపారు. నగరవాసులు ఎవరికీ వారుగా స్వీయ నియంత్రణ పాటించాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.

ఇదిలా ఉంటే, తిరుమలలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ కరోనా టెస్ట్ లు చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగులకు కరోనా టెస్టులు నిర్వహించడానికి ట్రూనాట్ కిట్ లు కొనుగోలు చేయాలన్నారు. తిరుమల ఉద్యోగుల క్యాంటీన్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం అందించాలని సూచించారు. తిరుమలలో డ్యూటీలు చేస్తూ బ్యారక్ లో ఉంటున్న సెక్యూరిటీ సిబ్బందికి కొందరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్నారు. అలాగే ఉద్యోగులందరికీ ప్రత్యేకంగా గదులు కేటాయించాలని పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇప్పటి వరకూ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురు కాలేదని,. భక్తులతో ఫోన్ ద్వారా ఆరోగ్యం గురించి వివరాలు సేకరిస్తున్నాం ఈఓ తెలిపారు.

అలాగే టీటీడీ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఉద్యోగుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.