AP Corona Cases Update: ఏపీలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాప్తి.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే..!

|

Mar 21, 2021 | 7:35 PM

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 368 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య..

AP Corona Cases Update: ఏపీలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాప్తి.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే..!
Follow us on

Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 368 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,93,734కి చేరింది. ఇందులో 2,188 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,84,357 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో ఎలాంటి మరణాలు జరగలేదు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 7189కు చేరుకుంది. ఇక నిన్న 263 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,47,36,326 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 40, చిత్తూరు 40, తూర్పుగోదావరి 20, గుంటూరు 79, కడప 10, కృష్ణా 37, కర్నూలు 49, నెల్లూరు 20, ప్రకాశం 6, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 39, విజయనగరం 9, పశ్చిమ గోదావరి 9 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

చిత్తూరు జిల్లాలో మహమ్మారి ఉధృతి అధికంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మరే జిల్లాలో నమోదుకాని రీతిలో చిత్తూరు జిల్లాలో కేసుల సంఖ్య పెరగడం జిల్లావాసులను కలవరపెడుతోంది. గత ఏడాది కాలంలో జిల్లాలో 88,349 కేసులు నమోదవగా 857 మంది కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. అత్యధిక మరణాలతో రాష్ట్రంలో ఫస్ట్ ప్లేసులో ఉన్న చిత్తూరు జిల్లా … తాజాగా నమోదవుతున్న కేసులు కూడా అదే స్థాయిలో ఉండటంతో అధికారుల్లో టెన్షన్ నెలకుంది.

ఇవి కూడా చదవండి :ఈ పనిని 10 రోజుల్లో చేయండి..! లేకపోతే మీ పాన్ కార్డు పనికిరాదు..! 10 వేల వరకు ఫైన్ కూడా పడే ఛాన్స్..!


Malaika Arora Is The Hottest: బోల్డ్ ఫోటోలతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్న మలైకా అరోరా.. లైక్ చేసిన ప్రియుడు అర్జున్ కపూర్


Next CJI..?: సీజేఐ రేసులో ఎవరు ఉన్నారు…? కొత్త భారత ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు బిడ్డ రాబోతున్నాడా..!