తెలుగు రాష్ట్రాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోది. గత రెండు రోజులుగా ఏపీ, తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూ కరోనా ఘంటికలు మోగిస్తోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 644 కాగా, అటు ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 502గా నమోదైంది.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు గత మూడు రోజులుగా పెరిగిపోతున్నాయి.. వాస్తవానికి మార్చి 10 ,11 న తగ్గినట్టే తగ్గి ఆ తరువాత వైరస్ ప్రభావం పెరిగింది. 14 న ఏకంగా 61 కేసులు నమోదు కాగా నిన్న కొత్తగా మరో 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. తాజాగా మరో 52 మందికి వైరస్ సోకడంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 644 కు చేరింది. అంతేకాదు కరోనాతో 18 మంది మృతి చెందారు. వైరస్ భారిన పడి కోలుకున్న 110 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
644 కేసుల్లో 249 కేసులు కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు అయ్యాయి. ఆ తరువాత 36 పాజిటివ్ కేసులతో నిజామాబాదు రెండో ప్లేస్ లో ఉంది. ఆ తరువాత రంగారెడ్డి, వికారాబాద్ లో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక సూర్యాపేట జిల్లాలో కొత్తగా మరో మూడు కేసులు నమోదు కాగా ఇందులో సూర్యాపేటలో ఇద్దరు, తిరుమలగిరిలో ఒకరికి కరోనా నిర్ధారణ అయింది.
అటు, ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా విజృంభిస్తోంది. బుధవారం మరో 19 కేసులు నమోదయ్యాయి. వీటిలో పశ్చిమగోదావరి జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 6, గుంటూరు జిల్లా 4, కృష్ణా జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు తాజా బులిటెన్‌లో తెలియజేశారు. ఈ 19 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 502కు పెరిగింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 16మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. 11మంది చనిపోయారు. గుంటూరు జిల్లా 118 పాజిటివ్ కేసులతో టాప్‌లో ఉంది. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో నమోదుకాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
ఇక జిల్లాలవారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి….
గుంటూరు జిల్లా – 118
కర్నూలు జిల్లా – 97
నెల్లూరు జిల్లా – 56
ప్రకాశం జిల్లా – 42
కృష్ణా జిల్లా -45
కడప జిల్లా – 33
పశ్చిమ గోదావరి జిల్లా – 31
విశాఖపట్నం జిల్లా -20
చిత్తూరు జిల్లా – 23
తూర్పుగోదావరి జిల్లా – 17
అనంతపురం జిల్లా -20
= మొత్తం కేసులు -502