Corona: టీకాలు వేస్తున్నా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.. కారణమేంటో తెలుసా..?

|

Jan 08, 2022 | 6:01 PM

Corona: దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మరోవైపు టీకాలు కూడా అంతే వేగంగా వేస్తున్నారు. అయినా కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. వ్యాక్సిన్ వల్ల ఎటువంటి

Corona: టీకాలు వేస్తున్నా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.. కారణమేంటో తెలుసా..?
Covid 19
Follow us on

Corona: దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మరోవైపు టీకాలు కూడా అంతే వేగంగా వేస్తున్నారు. అయినా కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదా అని అందరికి అనుమానం వస్తోంది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇన్‌ఫెక్షన్ రాదని ఏ ఇన్‌స్టిట్యూట్ లేదా ఏ డాక్టర్ చెప్పలేదు. వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా ఇక రాదని అర్థంకాదు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా కోవిడ్‌ నియమాలను తప్పకుండా పాటించాలి.

వ్యాధి తీవ్రమైన ప్రభావాలను తగ్గించడానికి టీకా తయారు చేశారు. అంటే ఆ వ్యక్తికి వ్యాధి సోకకుండా అతని పరిస్థితి తీవ్రంగా మారకుండా మాత్రమే జరుగుతుంది. టీకా ముఖ్య ఉద్దేశ్యం శరీరంలో ఇన్ఫెక్షన్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడం. ఓమిక్రాన్ బారిన పడిన వారిని కూడా చూస్తున్నాం. వారిలో లక్షణాలు చాలా తేలికపాటివి. అంటే ఇన్ ఫెక్షన్ సోకినా కూడా పెద్దగా ఇబ్బంది పడటం లేదు. బహుశా అది వ్యాక్సిన్ ప్రభావమే కావచ్చు. దీని కారణంగా కొత్త వేరియంట్ తీవ్ర ప్రభావం చూపడం లేదు.

వ్యాక్సిన్ తీసుకోని వారు చాలా ప్రమాదంలో ఉన్నారు
వ్యాక్సిన్ తీసుకోని వారు చాలా ప్రమాదంలో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి సోకిన తర్వాత అతని పరిస్థితి తీవ్రంగా క్షీణిస్తోంది. టీకా తీసుకోని వ్యక్తులలో మరణాల ప్రమాదం టీకా తీసుకున్న వారి కంటే చాలా రెట్లు ఎక్కువ. గణాంకాలు చూస్తే అదే నిజమని తేలుతుంది. ఇప్పటివరకు వ్యాక్సిన్‌ తీసుకోని వ్యక్తికి కరోనా పాజిటివ్ వస్తే అతన్ని ఆసుపత్రిలో ఆక్సిజన్ సపోర్టులో ఉంచాలి. రెండు డోసులు తీసుకున్న వారికి మూడు నాలుగు రోజుల్లో తగ్గుతుంది. వ్యాధి తీవ్రమైన ప్రభావాలను తగ్గించడంలో టీకా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

కొంతకాలం తర్వాత రోగనిరోధక శక్తి తగ్గవచ్చు
దేశంలో చాలామంది నాలుగైదు నెలల క్రితమే రెండు డోసులను తీసుకున్నారు. కాలక్రమేణా వ్యాక్సిన్ నుంచి యాంటీబాడీస్ స్థాయి కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది వ్యక్తుల వయస్సు వారి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ టీకా నుంచి రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందో ఇప్పటివరకు ఏ పరిశోధన వెల్లడించలేదు. అయితే దాని సమయం ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం మధ్య ఉంటుంది. బూస్టర్‌ డోస్‌ ప్రారంభంకావడానికి ఇదే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Child Mutual Fund: పిల్లల పేరుపై మ్యూచ్‌వల్‌ ఫండ్‌ ప్రారంభించండి.. 15 సంవత్సరాల తర్వాత 30 లక్షలు పొందండి..

Kitchen: ఈ 5 వస్తువులు కిచెన్‌లో ఉంటే ఇప్పుడే తొలగించండి.. వెంటనే ఆరోగ్యం మెరుగవుతుంది..?

SBI Clients: ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. మీ అకౌంట్‌ బ్లాక్ అయిందని మెస్సేజ్ వచ్చిందా..?