Corona Third Wave: కరోనా నుంచి కోలుకున్నారా.. తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. అవి ఏమిటంటే..

Corona Virus Third Wave: దేశంలో థర్డ్ వేవ్ లో కరోనా వైరస్(Corona Virus) వ్యాప్తి అధికంగా ఉండి. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఓ వైపు కరోనా కేసులు..

Corona Third Wave: కరోనా నుంచి కోలుకున్నారా.. తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. అవి ఏమిటంటే..
Coronavirus

Updated on: Jan 23, 2022 | 12:16 PM

Corona Virus Third Wave: దేశంలో థర్డ్ వేవ్ లో కరోనా వైరస్(Corona Virus) వ్యాప్తి అధికంగా ఉండి. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఓ వైపు కరోనా కేసులు.. మరోవైపు ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాధి లక్షణాలు కొంచెం భిన్నంగా ఉండడమే కాదు.. వ్యాధి తీవ్రత కూడా తక్కువగా ఉండడంతో కొంత ఊరట లభిస్తుంది.

దేశంలో రోజు రోజుకీ కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అయితే సెకండ్ వేవ్ లోని కరోనా డెల్టాతో పోలిస్తే.. ఈ ఒమిక్రాన్ వల్ల ప్రాణహాని తక్కువగా ఉంది. అందుకనే వ్యాధి నిర్ధారణ అయిన వారు హోమ్ క్వారంటైన్ లో ఉండి తగినంత విశ్రాంతి తీసుకోవాలని.. మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, చికిత్స తీసుకోవడం వల్ల ఒమిక్రాన్ నుండి విముక్తి పొందవచ్చని వైద్య శాఖ చెబుతోంది. అయితే వ్యాధి నుంచి కోలుకున్న తరవాత బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విషయంలో అనేక మందికి సందేహాలున్నాయి. ఈరోజు కరోనా నుంచి కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన జగ్రత్తలు గురించి తెలుసుకుందాం.

లక్షణాలు తక్కువగా ఉండి.. వ్యాధి తీవ్రత తక్కువగా ఉండి కరోనా నుండి కోలుకున్న వారు ఐదు రోజుల పాటు ఇతరులకు సామాజిక దూరం పాటించాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) పేర్కొంది. అంతేకాదు మాస్క్ తప్పని సరిగా ఐదు రోజులు పాటు ధరించాలని చెప్పింది.

కరోనా లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నవారు లక్షణాలు కనిపించిన మొదటి రోజు నుండి పది రోజుల వరకు ఐసోలేషన్ లో ఉండాలి. 20 రోజులపాటు హోమ్ క్వారంటైన్ లో ఉండి.. తగిన విశ్రాంతి తీసుకుంటూ కరోనా నిబంధనలు పాటించాలి. అయితే వీరు కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎలా ఉండాలి అనే మార్గదర్శకాలను CDC జారీ చేయలేదు. అయినప్పటికీ కరోనా నుంచి కోలుకున్నవారు కొన్ని రోజుల పాటు మాస్క్ ధరిస్తూ.. సామాజిక దూరం పాటించడం అది.. వారికి.. వారి ఫ్యామిలీకి మంచిది.

Also Read: థర్డ్ వేవ్ మరణాల్లో 60 శాతం మంది వారే.. తాజా అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడి.