చికిత్స చేసిన వైద్యుడిపై ఉమ్మి వేసిన.. కరోనా సోకిన వ్యక్తి

| Edited By:

Apr 12, 2020 | 9:10 PM

ప్రపంచాన్నంతా భయబ్రాంతులకు గురి చేస్తోంది కరోనా వైరస్. దీని పేరు ఎత్తుతేనే ప్రజలు తీవ్ర భయానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రాణాలను పణంగా పెట్టి కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కానీ అలాంటి వారిపైనే పలువురు..

చికిత్స చేసిన వైద్యుడిపై ఉమ్మి వేసిన.. కరోనా సోకిన వ్యక్తి
Follow us on

ప్రపంచాన్నంతా భయబ్రాంతులకు గురి చేస్తోంది కరోనా వైరస్. దీని పేరు ఎత్తుతేనే ప్రజలు తీవ్ర భయానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రాణాలను పణంగా పెట్టి కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కానీ అలాంటి వారిపైనే పలువురు కొందరు ఉన్మాదులు దారుణంగా దాడులకు పాల్పడటమే కాకుండా.. అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు. తాాజాగా తమిళనాడు తిరుచురాపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదే తరహా ఘటన జరిగింది. చికిత్స అందిస్తున్న వైద్యుడితో దురుసుగా ప్రవర్తించాడు కరోనా సోకిన వ్యక్తి. తను ధరించిన మాస్క్‌ను తొలగించి డాక్టర్‌పైకి విసిరాడు. ఆ తర్వాత మొహంపై ఉమ్మాడు. ఈ చర్యతో ఆస్పత్రిలోని సిబ్బంది సహా అక్కడున్న వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆ కరోనా సోకిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి:

ఈ దెబ్బకు జగన్ ఉద్యోగం ఊడినా ఆశ్చర్యపోనవసరం లేదు

ఐసోలేషన్, క్వారంటైన్‌కు మధ్య తేడాలేంటంటే?

హ్యాకర్ల నుంచి మీ ఫోన్‌ను రక్షించుకోండిలా..!

కరోనా బాధితుల్లో స్మోకింగ్ చేసేవారే ఎక్కువ

ఇకపై రోడ్డు మీదకొస్తే.. ఇలా పట్టుకుంటారు