లాక్‌డౌన్-2.0కు మార్గదర్శకాలు సిద్ధం చేస్తోన్న కేంద్రం

| Edited By:

Apr 13, 2020 | 8:51 PM

లాక్‌డౌన్-2.0కు మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రజా రోగ్యం, జీవనోపాధి రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రణాళిక చేస్తోంది. అలాగే వ్యవసాయానికి ఆంక్షలతో కూడిన సడలింపును ఇచ్చింది కేంద్రం. పంట కోత, పంట ఉత్పత్తుల అమ్మకాలకు అడ్డు లేకుండా...

లాక్‌డౌన్-2.0కు మార్గదర్శకాలు సిద్ధం చేస్తోన్న కేంద్రం
Follow us on

లాక్‌డౌన్-2.0కు మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రజా రోగ్యం, జీవనోపాధి రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రణాళిక చేస్తోంది. అలాగే వ్యవసాయ రంగానికి ఆంక్షలతో కూడిన సడలింపును ఇచ్చింది కేంద్రం. పంట కోత, పంట ఉత్పత్తుల అమ్మకాలకు అడ్డు లేకుండా చర్యలు చేపడుతోంది. ప్రజారోగ్యం కాపాడుతూ.. పరిశ్రమలు తెరిచేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఫ్యాక్టరీల్లోనే కార్మికులకు సోషల్ డిస్టెన్సింగ్‌తో భోజనం, వసతి ఏర్పాట్లు చేస్తుంది.

ఇక కరోనా ప్రభావం లేని జిల్లాల్లో మరింత ఎక్కువగా వెసులు బాటు పెంచింది కేంద్రం. ప్రత్యేక అనుమతులు, ప్రత్యేక బస్సులు, రైళ్లతో వర్కర్లను వెనక్కి రప్పించే ప్లాన్ చేస్తుంది. కరోనా ప్రభావం ఉన్న జిల్లాలు, నగరాలు, రాష్ట్రాల్లో మరిన్ని కఠిన ఆంక్షలు చేసింది కేంద్ర ప్రభుత్వం. లాక్‌డౌన్ పొడిగించిన బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు (ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, పంజాబ్, ఒడిశా)లలో కేంద్రం మార్గదర్శకాల మేరకు లాక్‌డౌన్-2.0పై బీజేపీ పాలిత రాష్ట్రాలు దృష్టి పెట్టాయి.

అలాగే కరోనా ప్రభావం దృష్ట్యా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది కేంద్రం. రెడ్ జోన్‌లను పూర్తిగా సీల్ చేయనున్నారు. ఆరెంజ్‌ జోన్‌లో సాధారణ లాక్‌డౌన్, గ్రీన్‌ జోన్‌లో సడలింపులు చేసింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మెట్రో నగరాల్లో సడలింపులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వ అధికారులు. అత్యధిక కేసులున్న ముంబై, ఢిల్లీలలో మరిన్ని కఠిన ఆంక్షలు చేసింది కేంద్రం.

ఇవి కూడా చదవండి:

సీఎం కేసీఆర్ చెప్పిన ‘హెలికాఫ్టర్ మనీ’కి అర్థమేంటంటే..?

ఈ దెబ్బకు జగన్ ఉద్యోగం ఊడినా ఆశ్చర్యపోనవసరం లేదు

ఐసోలేషన్, క్వారంటైన్‌కు మధ్య తేడాలేంటంటే?

హ్యాకర్ల నుంచి మీ ఫోన్‌ను రక్షించుకోండిలా..!

కరోనా బాధితుల్లో స్మోకింగ్ చేసేవారే ఎక్కువ