ఏపీని కరోనా వైరస్ వెంటాడుతోంది. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. కేవలం అయిదు రోజుల వ్యవధిలోనే కొత్తగా 350కేసులు నమోదు కావడం ఆ రాష్ట్రంలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. కాగా గడిచిన 24 గంటలలో కొత్తగా 82 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు మొత్తం 1259 కరోనా కేసులు వెలుగు చూశాయి .. కొత్త 80 కేసులలో ఒక్క కర్నూలు జిల్లాలోనే 40 కేసులు నమోదయ్యాయి..పూర్తి వివరాల్లోకి వెళితే…
ఏపీలో తాజా కరోనా హెల్త్ బులిటెన్‌ను ఆరోగ్యజశాఖ విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం కొత్తగా 82 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 40, గుంటూరు 17, కృష్ణా 13, కడప7, నెల్లూరు 3, చిత్తూరు 1, అనంతపురం 1 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,259కి చేరుకుంది. ప్రస్తుతం 970 మంది చికిత్స పొందుతుండగా, 258 మంది డిశార్చి అయ్యారు. 31 మంది మృతిచెందారు.
ఇక జిల్లాల వారిగా ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు పరిశీలించగా...అత్యధికంగా కర్నూలు జిల్లాలో 232 కేసులు, గుంటూరు 254,కృష్ణా జిల్లాలో 223 కేసులు నమోదు నమోదయ్యాయి. అనంతలో 54,చిత్తూరు లో 74, తూర్పు గోదావరిలో 39,కడపలో 65, నెల్లూరు లో 82, ప్రకాశంలో 56, శ్రీకాకుళంలో 4, విశాఖ 22, పశ్చిమ గోదావరి జిల్లాలో 54 కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి.. ఎపిలోని 13 జిల్లాలకు గాను విజయనగరం మినహా మిగతా 12 జిల్లాలు కరోనా భారీన పడ్డాయి.