కొంపముంచిన సెలూన్.. ఏకంగా 91 మందికి కరోనా..

|

May 25, 2020 | 3:12 PM

లాక్ డౌన్‌లో జుట్టు పెరిగిందని కటింగ్ షాపులకు వెళ్లేవారు ఇది తప్పక చదవాల్సిందే. హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి వెళ్లిన సెలూన్ కారణంగా ఏకంగా 91 మందికి కరోనా సోకింది. అందులో ఏడుగురు అక్కడ పని చేసే సిబ్బంది కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో లాక్ డౌన్ తర్వాత మళ్లీ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో మిస్సౌరీలో సెలూన్లు మే 4 నుంచి తెరుచుకున్నాయి. స్థానికులు అందరూ కూడా హెయిర్ కట్ చేయించుకునేందుకు వెళ్లారు. ఇలా ఏకంగా […]

కొంపముంచిన సెలూన్.. ఏకంగా 91 మందికి కరోనా..
Follow us on

లాక్ డౌన్‌లో జుట్టు పెరిగిందని కటింగ్ షాపులకు వెళ్లేవారు ఇది తప్పక చదవాల్సిందే. హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి వెళ్లిన సెలూన్ కారణంగా ఏకంగా 91 మందికి కరోనా సోకింది. అందులో ఏడుగురు అక్కడ పని చేసే సిబ్బంది కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో లాక్ డౌన్ తర్వాత మళ్లీ కార్యకలాపాలు మొదలయ్యాయి.

ఈ నేపధ్యంలో మిస్సౌరీలో సెలూన్లు మే 4 నుంచి తెరుచుకున్నాయి. స్థానికులు అందరూ కూడా హెయిర్ కట్ చేయించుకునేందుకు వెళ్లారు. ఇలా ఏకంగా 91 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు ఉన్న అక్కడ పనిచేసే సిబ్బందిలో ఒకరి వల్ల వైరస్ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. దీనితో ఈ మహమ్మారి ఎప్పుడు.. ఎలా సోకుతుందో తెలియక జనాలు ఆందోళన చెందుతున్నారు. కాగా, అమెరికాలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 16 లక్షలు పైచిలుక నమోదు కాగా… మరణాలు లక్ష చేరువలో ఉన్నాయి.