తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 17 రకాల వస్తువులతో కిట్.. పూర్తిగా ఫ్రీ

| Edited By:

Apr 09, 2020 | 9:10 PM

ఉచిత రేషన్‌తో పాటు డబ్బులు కూడా అందజేస్తోన్న విషయం తెలిసిందే. అయితే కేరళ సర్కార్ మరో అడుగు ముందుకేసి.. ఇంట్లోకి కావాల్సిన అన్ని రకాల సరుకులను ఓ కిట్ రూపంలో అందిస్తోంది. తెల్లరేషన్ కార్డున్న అందరికీ 17 సరుకులతో..

తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 17 రకాల వస్తువులతో కిట్.. పూర్తిగా ఫ్రీ
Follow us on

కరోనావైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ విధించింది మంచికే అయినా.. దీని వల్ల మధ్యతరగతి కుటుంబాలు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత రేషన్‌తో పాటు డబ్బులు కూడా అందజేస్తోన్న విషయం తెలిసిందే. అయితే కేరళ సర్కార్ మరో అడుగు ముందుకేసి.. ఇంట్లోకి కావాల్సిన అన్ని రకాల సరుకులను ఓ కిట్ రూపంలో అందిస్తోంది. తెల్లరేషన్ కార్డున్న అందరికీ 17 సరుకులతో కూడిన ఓ కిట్‌ని ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పటికే కేరళలో వీటి పంపిణీ కూడా ప్రారంభమైంది. ఒక్కో కిట్‌లో దాదాపు వెయ్యి రూపాయల విలువైన సరుకులు ఉంటాయి.

కిట్‌లో బియ్యం, కిలో పంచదార, కిలో ఉప్పు, 250 గ్రాముల టీ పౌడర్, కారం, కంది పప్పు, అరలీటర్ వంటనూనె, రెండు కేజీల గోధుమ పిండి, కేజీ రవ్వ, మినుములు, శనగలు, సబ్బులు మొదలైన 17 రకాల వస్తువులు ఉంటాయి. రేషన్ కార్డు కలిగిన ప్రజలందరూ షాపుల నుంచి వీటిని పొందవచ్చని కేరళ పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే ఆధార్ కార్డున్న ప్రతీ ఒక్కరికీ ఉచితంగా రేషన్‌, ఆహారాన్ని పంపిణీ చేస్తోంది కేరళ ప్రభుత్వం. అలాగే ప్రభుత్వం రిజస్టర్ చేసిన రేషన్ దుకాణాల్లో మాత్రమే ఈ కిట్‌‌ని తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం కేరళలో ఇప్పటివరకూ 345 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా ఇద్దరు మరణించారు. అలాగే 83 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

ఇవి కూడా చదవండి:

సీఎం కొత్త నిర్ణయం.. విలేజ్, వార్డు క్లీనిక్స్ ఏర్పాటు..

పిడుగుపాటు.. ఎమ్మెల్యే, కుటుంబసభ్యులకు తృటిలో తప్పిన ప్రమాదం

కరోనా భయంతో మొబైల్ టవర్లకు నిప్పు.. కారణం ఇదే!

కరోనాపై పోరుకు భారీ ప్యాకేజీ సిద్ధం చేసిన కేంద్రం

కరోనా ఇంపాక్ట్: రిజర్వ్ బ్యాంకులో వెయ్యి కోట్లు అప్పుతీసుకున్న ఏపీ ప్రభుత్వం

బస్ టికెట్ రిజర్వేషన్లు ఆపేసిన ఏపీఎస్ఆర్టీసీ..

మరో టాస్క్ ఇచ్చిన ప్రధాని.. ఈ సారి ఏం చేయాలంటే?