వరల్డ్ అప్డేట్: కరోనా కేసులు @ 54 లక్షలు… 3.45 లక్షల మరణాలు..

|

May 24, 2020 | 10:27 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 5,453,024 చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,466 మంది చనిపోయారు. ఇప్పటివరకు కరోనా బారిన పడి 345,074 మంది ప్రాణాలు […]

వరల్డ్ అప్డేట్: కరోనా కేసులు @ 54 లక్షలు... 3.45 లక్షల మరణాలు..
Follow us on

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది.

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 5,453,024 చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,466 మంది చనిపోయారు. ఇప్పటివరకు కరోనా బారిన పడి 345,074 మంది ప్రాణాలు కోల్పోగా.. 2,281,088 మంది కోలుకున్నారు.

అగ్రరాజ్యం అమెరికా, రష్యా, బ్రెజిల్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక కేసులు(1,673,454), మరణాలు(98,830) అమెరికాలో నమోదయ్యాయి. కాగా, ఇండియాలో ఇప్పటివరకు 137,991 కేసులు నమోదు కాగా.. 4,013 మృతి చెందారు.

కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల లిస్ట్…

  • అమెరికా – 1,673,454 కేసులు, 98,830 మరణాలు
  • బ్రెజిల్ – 352,523 కేసులు, 22,288 మరణాలు
  • రష్యా – 344,481 కేసులు, 3,541 మరణాలు
  • స్పెయిన్ – 282,370 కేసులు, 28,678 మరణాలు
  • బ్రిటన్ – 259,559 కేసులు, 36,793 మరణాలు
  • ఇండియా – 137,991 కేసులు, 4,013 మరణాలు