దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో ఎనమిది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. అందులో తమిళనాడులో 1000కి పైగా ఉన్నాయి. గత 24గంటల్లో106 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో.. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య1,075కు చేరినట్లు తమిళనాడు వైద్య శాఖ తెలిపింది. ఇక రాష్ట్రంలో కరోనా కాటుతో మరణించిన వారి సంఖ్య 11కు చేరగా.. ఈ మహమ్మారిని ఎదుర్కొని 50 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు.