క‌రోనా ఊర‌ట‌: త‌మిళ‌నాడులో స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు

|

Jun 16, 2020 | 10:07 PM

దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3.4 లక్షలు దాటింది. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తమిళనాడులో కరోనా కాస్తా..తగ్గుముఖం పట్టిన‌ట్లుగా క‌నిపిస్తోంది. రెండు రోజుల క్రితం వరకు రోజుకు 2000 ల‌కు పైగా కరోనా కేసులు నమోదుకావ‌టం ఆందోళ‌న క‌లిగించింది. అయితే

క‌రోనా ఊర‌ట‌: త‌మిళ‌నాడులో స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు
Follow us on
దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3.4 లక్షలు దాటింది. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైతో పాటు చెన్నై నగరంలో వైర‌స్ తీవ్ర కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో త‌మిళ‌నాడులోని నాలుగు జిల్లాలో ఎల్లుండి నుంచి క‌ఠిన లాక్‌డౌన్ అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తమిళనాడులో కరోనా కాస్తా..తగ్గుముఖం పట్టిన‌ట్లుగా క‌నిపిస్తోంది. రెండు రోజుల క్రితం వరకు రోజుకు 2000 ల‌కు పైగా కరోనా కేసులు నమోదుకావ‌టం ఆందోళ‌న క‌లిగించింది. అయితే సోమవారం 1800పైగా నమోదైన కేసులు మంగ‌ళ‌వారం మరింత తగ్గి 1500 మాత్రమే నమోదయ్యాయి. దీంతో కరోనా ప్రభావం కొంతమేర తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.
త‌మిళ‌నాడులో తాజా కేసులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన నివేదిక మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 1,515 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 49 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 1,438మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 48,019కి చేరింది. వీరిలో 20,709 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 26,782 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 528 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వైద్య శాఖ స్ప‌ష్టం చేసింది.