Corona Cases In World: ప్రపంచదేశాలను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ప్రస్తుతం దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 15,116,495 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 620,032 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 9,134,209 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో అత్యధికంగా 239,924 పాజిటివ్ కేసులు, 5,678 మరణాలు సంభవించాయి.
అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(4,028,733), మరణాలు(144,958) సంభవించాయి. అటు బ్రెజిల్ లో పాజిటివ్ కేసులు 2,166,532 నమోదు కాగా, మృతుల సంఖ్య 81,597కు చేరింది. ఇక రష్యాలో 789,190 పాజిటివ్ కేసులు,12,745 మరణాలు నమోదయ్యాయి. కాగా భారత్‌లో కరోనా కేసులు 1,055,932 నమోదు కాగా, మృతుల సంఖ్య 26,508కి చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 37,724 కరోనా పాజిటివ్ కేసులు, 648 మరణాలు సంభవించాయి.