Corona Second Wave: కొనసాగుతోన్న కరోనా విలయతాండవం.. దేశ వ్యాప్తంగా కేసులు అధికంగా నమోదవుతోన్న టాప్‌ పట్టణాలు ఇవే..

|

Apr 16, 2021 | 8:16 PM

Corona Second Wave: కరోనా పని అంతమైపోయిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే ఈ మాయదారి వ్యాధి మరోసారి రెచ్చిపోతోంది. కరోనా తొలి వేవ్‌ను మించి.. ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. పెరుగుతోన్న రోజువారి...

Corona Second Wave: కొనసాగుతోన్న కరోనా విలయతాండవం.. దేశ వ్యాప్తంగా కేసులు అధికంగా నమోదవుతోన్న టాప్‌ పట్టణాలు ఇవే..
Corona Cases In India
Follow us on

Corona Second Wave: కరోనా పని అంతమైపోయిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే ఈ మాయదారి వ్యాధి మరోసారి రెచ్చిపోతోంది. కరోనా తొలి వేవ్‌ను మించి.. ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. పెరుగుతోన్న రోజువారి కేసులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏకంగా రోజువారి కేసులు రెండు లక్షలు దాటడంతో అప్రకటిత అత్యవసర పరిస్థితిని తలపిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల కరోనా కేసులు ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి. తాజాగా నమోదవుతోన్న కేసుల ఆధారంగా దేశవ్యాప్తంగా అత్యధికంగా కేసులు నమోదవుతున్న పట్టణాలు జాబితా ఇలా ఉంది..

ఢిల్లీ..

కరోనా కేసుల నమోదులో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. కేవలం 24 గంటల్లోనే ఇక్కడ 17,282 కేసులు నమోదుకాగా 104 మంది మరణించారు. ఈ కారణంగానే ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పుణె..

కేసులు విపరీతంగా పెరుగుతోన్న మహారాష్ట్రలోని పుణె కేసుల విషయంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. దీంతో ప్రస్తుతం ఈ పట్టణంలో ఇప్పటి వరకు 6,79,313 కేసులు నమోదుకాగా 8,636 మంది మరణించారు.

ముంబయి..

మహారాష్ట్ర రాజధాని ముంబయి కరోనా కేసుల విషయంలో మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఇప్పటి వరకు 5,45,195 కేసులు నమోదుకాగా 12,417 మంది మరణించారు. కేవలం 24 గంటల్లోనే 9,931 కేసులు నమోదుకాగా 54 మంది మరణించారు.

బెంగళూరు..

బెంగళూరు నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు5,02,024 కేసులు నమోదుకాగా 4,933 మంది మరణించారు. ప్రస్తుతం బెంగళూరులో 1,12,213 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

థానే..

కరోనా విలయతాండవం చేస్తోన్న మహారాష్ట్రలోని మరో పట్టణం థానే కేసులు విషయంలో 5వ స్థానంలో ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు4,26,602 కేసులు నమోదుకాగా 6,325 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 6,280 కొత్త కేసులు నమోదుకాగా 33 మంది మరణించారు.

నాగ్‌పూర్..

నాగ్‌పూర్‌లోనూ కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు 303,760 కేసులు నమోదుకాగా 4,385 మంది మరణించారు.

చెన్నై..

చెన్నై ఎక్కువ కేసులు నమోదవుతున్న పట్టణాల్లో 7వ స్థానంలో ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు మొత్తం 2,72,118 కేసులు నమోదుకాగా 4,341 మంది మరణించారు.

నాశిక్‌..

నాశిక్‌లో ఇప్పటి వరకు మొత్తం 2,31,990కేసులు నమోదుకాగా.. వైరస్‌ కారణంగా 2505 మంది మరణించారు.

గువహటి..

గువహటిలో ఇప్పటి వరకు మొత్తం 2,21,868 కేసులు నమోదు కాగా 1,122 మంది మరణించారు. ప్రస్తుతం పట్టణంలో మొత్తం 3,200 యాక్టివ్‌ కేసులున్నాయి.

Also Read: Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ అలవెన్స్ కూడా..మార్గదర్శకాలు విడుదల!

Laptop: అసుస్ నుంచి అదిరిపోయే స్పెసిఫికేషన్స్ తో రెండు కొత్త ల్యాప్‌టాప్‌లు..మరి ధర ఎంతో తెలుసా?

Gandhi Hospital: మరోసారి కోవిడ్ ఆసుపత్రిగా గాంధీ హాస్పిటల్స్.. రేపటి నుంచి పూర్తిస్థాయిలో కరోనా సేవలు