
దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. గత 24 గంటల్లో కొత్తగా 11,400 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 377 కి పెరిగింది. రెండో విడత లాక్ డౌన్ ప్రారంభమయ్యాక.. మొత్తం కేసులు 11,439 కాగా.. 1076 ఫ్రెష్ ఇన్ఫెక్షన్లు బయటపడ్డాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 178 మంది కరోనా రోగులు మరణించారని, 2,687 కేసులు నమోదయ్యాయని, 1305 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తమిళనాడులో 1204, తెలంగాణాలో 624, ఏపీలో 483, రాజస్థాన్ లో 969, మధ్యప్రదేశ్ లో 730, గుజరాత్ లో 650 కేసులు నమోదయ్యాయి. ఇంకా వివిధ రాష్ట్రాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆస్సాం..32
బీహార్ ..66
ఢిల్లీ..1561
హర్యానా ..199
కర్ణాటక..260
కేరళ..387
పంజాబ్..176
పశ్చిమ బెంగాల్..213
ఛత్తీస్ గడ్..33
ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు మరీ పెద్ద సంఖ్యలో లేవని తెలుస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మొత్తం దాదాపు 20 లక్షల వరకు చేరుకోగా.. లక్షా 26 వేల మంది మరణించారు. అమెరికాలో 6 లక్షల కేసులు నమోదు కాగా.. 26 వేల మంది మృత్యు బాట పట్టారు. స్పెయిన్ లో 1.74 లక్షలు, ఇటలీలో 1.62 లక్షలు, జర్మనీలో 1.32 లక్షలు, ఫ్రాన్స్ లో 1.31 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇటలీలో 21,067 మంది, స్పెయిన్ లో 18,255,ఫ్రాన్స్ లో 15,729 మంది రోగులు మృతి చెందారు.